Sunday, 15 April 2018

Tips To Get Pass Marks In Telugu Subject For 10Th Class Students


Tips To Get Pass Marks In Telugu Subject For 10Th Class Students
10 తరగతి విద్యార్థులు తెలుగులో పాస్ మార్కులు పొందడం ఎలా

- తెలుగు లో ఒక్కొక్క పాఠం పూర్తిగా చదివినా తెలుగులో పదికి 10 పాయింట్లు సాధించవచ్చు. తెలుగు ప్రిపరేషన్‌కు రోజు కొంత సమయం కేటాయించాలి.
-
ఒక్కో పాఠానికి 4, 5 రోజులు కేటాయించుకున్నా సరిపోతుంది.
-
సీసీఈ పద్ధతిలో ప్రశ్న, జవాబు పద్ధతిలో కాకుండా ఏ పాఠంలోని ప్రశ్నలు చదవాలనుకుంటున్నారో ఆ పాఠాన్ని ఒకసారి క్షుణ్ణంగా అభ్యసించాలి. ఇంతకుమించి చదివినాసరే మళ్లీ చదవడంవల్ల జవాబులు సులువుగా నేర్చుకోవచ్చు.

- పాఠాన్ని ఒకసారి చదివిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు ప్రయత్నించాలి.
- 3 మార్కుల ప్రశ్నలకు, బాక్స్‌లోని ప్రశ్నలు, కవి పరిచయాలు, కవి రచనాశైలిని అభినందిస్తూ రాయడం, పాత్ర స్వభావం, మాటల ఆంతర్యం, ఈ మాట ఏ సందర్భంలో అన్నారు, కవి, పాత్రల అభిప్రాయాలు, ఏకీభవిస్తూ, సమర్థిస్తూ, విభేదిస్తూ రాయగలగాలి.
-
అలాగే విషయాన్ని విశ్లేషిస్తూ, విమర్శిస్తూ రాయగలగాలి.

- అభిప్రాయాలు, ఏకీభవిస్తూ, సమర్థిస్తూ, విభేదిస్తూ అనేవి 6 మార్కులకు కూడా రావచ్చు. 3 మార్కులవి 5, 6 వాక్యాల్లో, 6 మార్కులవి 10, 12 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది.
- 6
మార్కుల ప్రశ్నలకు పద్యభాగ సారాంశాలు రాయగలగాలి.
- 6 మార్కుల ప్రశ్నలకు ఉదాహరణగా పల్లెల్లో వచ్చిన మార్పులు, ఆనాటి పరిస్థితులు, దానశీలంగల వ్యక్తుల ఆవశ్యకత, భాగ్యరెడ్డి వర్మ సంఘసేవ, కోపంవల్ల కలిగే అనర్థాలు, వీరతెలంగాణ సారాంశం, గోల్కొండ అందచందాలు మొదలైన వాటిపై రావచ్చు.

- అలాగే పేపర్- IIలో 5 మార్కుల ప్రశ్నలకు పాఠంలోని అంశాలు, సమకాలీన అంశాలపై సృజనాత్మకత ప్రశ్నలు అడగవచ్చు.
-
మిత్రునికి లేఖ, నినాదాలు, సూక్తులు, కవిత, చిన్నకథ, కరపత్రం, అభినందన వ్యాసం, సంపాదకీయ వ్యాసం, ఆత్మకథ, ఏకపాత్రాభినయం, పుస్తక సమీక్ష లాంటివి అడగవచ్చు.

-
ఉదా: నీవు చూసిన పల్లెటూరు గురించి మిత్రునికి లేఖ, స్వచ్ఛభారత్ గురించి కరపత్రం, చెరువుల ఆవశ్యకత గురించి సంభాషణ, తెలంగాణ తల్లి ఏకపాత్రాభినయం లాంటివి ఏదైనా అడగవచ్చు.
-
కాబట్టి పాఠం చివరున్న ప్రశ్నలు అన్ని కోణాల్లోంచి తప్పక ప్రిపేర్ కావాలి.
-
పాఠం చివర ఉన్న అభ్యాసాలకు ఒక పెన్సిల్ తీసుకొని సమాధానాలు బుక్‌లో రాసుకోవాలి. ఒకవేళ రాసి ఉంటే వాటిని తుడిచి మళ్లీ సొంతంగా సమాధానాలు రాయాలి.

- పాఠం వెనుక ఉన్న సంధులు, సమాసాలు, అలంకారాలు, గణ విభజన, వ్యవహారిక భాషలోకి మార్చడం, వాక్యభేదాలు, సొంతవాక్యాలు, కర్తరి, కర్మణి వాక్యాలు చేయగలగాలి.
-
పదజాలానికి సంబంధించి పుస్తకం చివర ఉన్న పదవిజ్ఞానం తప్పక చదవాలి. అందులోనుంచే వచ్చే అవకాశం ఉంది.
-
ఉపవాచకం రామాయణాన్ని ఒక్కొక్క కాండ రెండురోజులు చదివినా 12 రోజుల్లో పూర్తిచేయవచ్చు. అప్పుడు ఏ ప్రశ్నలు వచ్చినా రాయగలుగుతారు.

- రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, వృత్తాంతాలు, పాత్ర స్వభావాలు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి.
-
ముఖ్యంగా పాత్రల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పాత్రల పేర్లు లేకుండా సమాధానాలు రాస్తే మార్కులు రావు.
-
ఒక పాత్ర పేరును ఇంకో పాత్రకు రాస్తుంటారు. అలా కాకుండా ఉండాలంటే మనసుపెట్టి చదవాలి.

- చదివిన సమాధానాలు వెంటనే ఒక నోటు పుస్తకంలో రాసుకుంటే మరిచిపోయే అవకాశం ఉండదు.
-
తెలుగును వీలైనంత త్వరగా పూర్తిచేస్తే కఠినమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించుకునేందుకు వీలవుతుంది.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS