Sunday, 15 April 2018

Tips To Get Pass Marks In Social Studies For 10Th Class Students


Tips To Get Pass Marks In Social Studies For 10Th Class Students
10 తరగతి విద్యార్థులు సాంఘీకశాస్త్రంలో పాస్ మార్కులు పొందడం ఎలా

- సాంఘీకశాస్త్రం పాస్ కావడం, పది గ్రేడ్ సాధించడం వెనుక ప్రయత్నించే పద్ధతుల్లో విద్యార్థి, విద్యార్థికి భిన్నమైన వ్యూహాలు ఉంటాయి. వాటికి తోడుగా పాఠ్యాంశాల్లోని కీలక భావనలపై పట్టు సాధించి, మెరుగైన ఫలితాలు పొందడానికి గత ప్రశ్నపత్రాల పరిశీలన, ఉపాధ్యాయుల సూచనలు తోడ్పుడతాయి.

- ప్రతి పాఠ్యాంశాన్ని అవగాహన కోసం, ప్రారంభం నుంచి చవరి వరకు క్షుణ్ణంగా. నూతన పదజాలం, కీలక భావనలు గుర్తించి పెన్సిల్‌తో కింద గీసి, తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో చర్చించడం ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
-
పాఠ్యాంశాల్లో మధ్యన ఉన్న ప్రశ్నల బాక్సులను ఒకటికి రెండు సార్లు చదివి స్యీయ మూల్యాంకనం చేసుకోవాలి.

-
అదనపు సమాచార బాక్సులను చదవాలి. ఇవి తమ స్థానిక అంశాల అవగాహనకు అనుభవాల వ్యక్తీకరణకు, ప్రతిస్పందనకు దోహదపడుతాయి.
-
ఇచ్చిన సమాచార పట్టికలను పూరించడం, డయాగ్రామ్‌లు, బార్ గ్రాఫులు, లైన్ గ్రాఫులు విశ్లేషించడం మరియు ప్రశ్నలు తయారు చేయడం ప్రాక్టీసు చేయాలి. సమాచార పట్టికలు పరీక్షల్లో పాఠ్యాంశాల పరిధిని దాటి విశ్లేషించమనడం, ప్రశ్నలు ఇచ్చి రాయమనడానికి కూడా అవకాశం ఉన్నది.

- పరీక్షల్లో ముఖ్యమైన భాగం ప్రతి పేపర్‌లోని 40 మార్కుల్లో 16 మార్కులు అంటే 40 శాతం భారత్వం విషయావగాహననకు ఇస్తున్నారు. కాబట్టి చదువుతున్న సమయంలో విశ్లేషించడం, వివరించడం, పోలికలు, భేదాలు, కారణాలు మరియు సంబంధాలు ఉదహరించడం వంటి అంశాలను గుర్తించి చదవాలి.

-
చదివి, వ్యాఖ్యానించడానికి 4 మార్కులు అంటే 10 శాతం భారత్వం ఇచ్చారు. ఇందుకోసం పాఠ్యాంశాల్లో వ్యాఖ్యానించే పేరాగ్రాఫ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి సారాంశాన్ని ఒక పేరాగ్రాఫ్‌గా, తన స్వీయ అభిప్రాయాన్ని ఒక పేరాగ్రాఫ్‌గా రాసే ప్రాక్టీసు చేయడం, ఇది విద్యార్థి విద్యార్థికి భేదం ఉంటుంది.
- భిన్న కోణాల్లో ప్రతిస్పందించడం దీని ప్రధాన ఆశయం. కాబట్టి రాసిన విషయాన్ని తరగతి గదిలో ప్రదర్శించి, సూచనలను తీసుకోవాలి. భావవ్యక్తీకరణ తార్కిక విశ్లేషణా సామర్థ్యం పెంచుకోవాలి.

- సమాచార నైపుణ్యాలకు 6 మార్కులు అంటే 15 శాతం భారత్వం ఇచ్చారు. పాఠ్యాంశాలలోని సమాచారాన్ని పట్టికల్లో రాయడం, పట్టిక ఇచ్చి దానిపై ప్రశ్నలు వేయడం గ్రాఫ్‌లు విశ్లేషించడం.

-
సమకాలీన అంశాలు ప్రతిస్పందన అంశానికి 4 మార్కులు అంటే 10 శాతం భారత్వం ఇచ్చారు. పాఠ్యాంశాలలో సమకాలీన అంశాలను అనువర్తనంతో చర్చించడానికి అవకాశం ఉన్న పేరాలను గుర్తించి, విశ్లేషణ చేయాలి. దీనికోసం ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాలను విస్తతంగా అధ్యయనం చేయాలి. సంబంధిత సమకాలీన సమస్యలకు కారణాలు, నివారణకు సూచనలు, సమస్యలపై స్పందించడం, ప్రశ్నించడం వంటి నైపుణ్యాలు పెంపొందుతాయి. తద్వారా పిల్లల ఆలోచన, బహుళ సమాధానాల వ్యక్తీకరణకు అవకాశం ఉంటుంది.

-
పట నైపుణ్యాలు అంశంలో 6 మార్కులు అంటే 15 శాతం భారత్వం ఇచ్చారు. ఇందులో పటాలు గీయడం, పటంలో ప్రదేశాలు గుర్తించడం, పటాన్ని చదివి విశ్లేషించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం వంటివి ఉంటాయి. ముఖ్యంగా పటాలు గీయడంలో తెలంగాణ, భారతదేశ పటాలు గీయడంలో నైపుణ్యం పెంచుకోవాలి.

- పట నైపుణ్యాల్లో గుర్తించమని అడిగే ప్రశ్నలు నేరుగా ఇవ్వకుండా దేశంలోని ఏదైనా పర్వత శ్రేణిని, పీఠభూమిని, గంగానది ఉపనది, గోదావరి నది ప్రవహించే రాష్ట్రం, అరేబియా సముంద్రంలో కలిసే నది, భారతదేశపు గొప్ప ఎడారి వంటివేకాక ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న కేంద్ర రాష్ర్టాల కూటమికి చెందిన ఏదైనా ఒక దేశం, జర్మనీపై బాంబు వేసిన దేశం, బ్రిటిషు వలస దేశం, ద్వీపకల్ప దేశం గుర్తించమనడం జరుగుతుంది.

-
ప్రశంస, సున్నితత్వం అంశాల్లో 4 మార్కులు అంటే 10 శాతం భారత్వం ఇచ్చారు. పాఠ్యాంశాల్లో ఉన్న మంచి విషయాలను, ఇతరుల అభిప్రాయాలకు విలువనీయడం సరైన వైఖరుల వృద్ధికి అవకాశం ఉన్న పేరాగ్రాఫ్‌లు గుర్తించాలి.

- స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, దేశభక్తి, దేశ సమైక్యత, రాజ్యాంగ విలువలు పెంపొందించే అంశాలు, అనుకూల, ప్రశంస వైఖరులను పెంపొందించడానికి, స్పందనను తెలిపే పోస్టర్లు, నినాదాలు, పత్రికలకు, అధికారులకు లేఖలు రాయడం, కరపత్రాలు తయారు చేసి ప్రదర్శించడం, చర్చించడం ద్వారా పరీక్షల్లో సులువుగా మార్కులు సాధించవచ్చు.

-
పాఠ్యాంశాల్లోని కీలక పదాలు పాఠం చివరన ఇచ్చారు. వీటిని ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోర్డుపై రాసి విద్యార్థులతో చర్చించి సమాధానాలు రాబడుతారు. చర్చల్లో పాల్గొనడం ద్వారా విస్తృత అవగాహన పొందవచ్చు.
-
పాఠ్యాంశాల్లో చివరగా మూల్యాంకన ప్రక్రియ మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి శీర్షిక కింద ఇచ్చిన ప్రశ్నలతో పాఠ్యాంశం ఎంత వరకు అవగాహన చేసుకున్నారో స్వీయ మూల్యాంకనం ద్వారా ఫలితాలను అంచనా వేసుకోవచ్చు.

- కాబట్టి సమాధానాలు మూస ధోరణిలో కాకుండా అవగాహన, సృజనాత్మకత, విశ్లేషణా నైపుణ్యాలు, తార్కిక వివేచన పాఠ్యాంశాలను విశ్లేషాణాత్మకంగా చదవడం ద్వారా ప్రశ్నలు ఎలా ఇచ్చినా సమాధానాలు రాయవచ్చు.
-
మాధ్యమిక వస్తువులకు ఉదాహరణ ఇవ్వండి అనే ప్రశ్నకు, మన ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వినియోగ వస్తువులు ఏవో, మాధ్యమిక వస్తువులు ఏవో తెలిసి ఉండాలి.

- జాతీయ రాజకీయపార్టీకి ఉదాహరణ ఇవ్వండి అని అడిగినప్పుడు జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలపై పూర్తి అవగాహన ఉంటేనే రాయవచ్చు.
-  ప్రపంచంపై ఆర్థిక మాంద్య ప్రభావాలను రాయమని అడిగితే, అమెరికా, జర్మనీ, రష్యా దేశాలలోని ప్రభావాలను అధ్యయనం చేయడం ద్వారా ఏ దేశం గురించి అయినా ప్రత్యేకంగా అడిగినా సమాధానం బాగా రాసే అవకాశం ఉంటుంది.

- జనాభాలో స్త్రీపురుషుల నిష్పత్తిలో స్త్రీల జనాభా తగ్గడం వల్ల సమాజంపై ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో విద్యార్థి, విద్యార్థికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి సమాధానాలు బహుకోణాల్లో ప్రదర్శించాలి.
- దేశ స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా గాంధీ నిర్వహించిన పాత్ర లేదా కృషి లేదా నచ్చిన అంశాలు రాయమన్నప్పుడు మహాత్మాగాంధీ గురించి సమగ్ర సమాచారం అధ్యయనం చేయాలి.

- బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో నీకు నచ్చిన అంశాలేవో రాయమన్నప్పుడు అంబేద్కర్ గొప్పతనం, ఆయన రాజ్యాంగ రచనలో నిర్వహించిన పాత్రపై అవగాహన పెంచుకోవాలి.

-
ఎన్ని చాప్టర్లు చదివాము అనే దాని కంటే పాఠ్యాంశాలను ఎంత వరకు అవగాహన చేసుకున్నామో అనేది ముఖ్యం.

- పాఠాలు చదువుతున్నప్పుడు. ఆ పాఠంలోని ముఖ్య భావనలతో మేధో చిత్రాలు, ఫ్లో చార్టులు తయారు చేసుకోవడం వల్ల పునశ్చరణ సులువవుతుంది. సిలబస్ పూర్తి చేసుకొని పునశ్చరణ చేస్తున్న నేపథ్యంలో ప్రతి పాఠ్యాంశంపై పూర్తి అవగాహన కోసం నోట్స్ తయారు చేసుకోవాలి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS