Sunday, 15 April 2018

Tips To Get Pass Marks In Mathematics For 10Th Class Students


Tips To Get Pass Marks In Mathematics For 10Th Class Students
10 తరగతి విద్యార్థులు గణితంలో పాస్ మార్కులు పొందడం ఎలా

- సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా పదో తరగతి గణితానికి పేపర్-1, పేపర్-2 అని రెండు పేపర్ల ద్వారా పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు.
- పేపర్-1, పేపర్-2లోని అధ్యాయాలు
-
పేపర్-1 లో వాస్తవ సంఖ్యలు, సమితులు, బీజగణితం, బహుపదులు, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, వర్గ సమీకరణాలు, శ్రేఢులు, నిరూపక రేఖా గణితం.

-
పేపర్-2లో రేఖాగణితం-సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఖండన రేఖలు, క్షేత్ర గణితం, సాంఖ్యాక శాస్త్రం, సంభావ్యత, త్రికోణమితి-అనువర్తనాలు అనే అధ్యాయాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
రాతపరీక్ష (మార్కులు-80)
-
పేపర్-1లో 40 మార్కులు, పేపర్-2 లో 40 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కులు నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా కేటాయిస్తారు.

-
సమయం: పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి రెండున్నర గంటలు మొత్తం రెండు గంటల 45 నిమిషాల సమయం ఉంటుంది.

-
ఉత్తీర్ణత మార్కులు: గణితంలో ఉత్తీర్ణులు కావడానికి 80కిగాను 28 మార్కులు (35 శాతం మార్కులు) పొందాలి. అంటే ప్రతి పేపర్‌లో కనీసం 14 మార్కులు పొందాల్సిన అవసరం లేకుండా మొత్తంగా మాత్రమే కనీసం 28 మార్కులు సాధించాలి.

-పబ్లిక్ పరీక్షలో  నిర్మాణాత్మక మూల్యాంకన మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకుగాను 35 మార్కులు ఆపై సాధించిన విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు.

-
పబ్లిక్ పరీక్షలో 28 కన్నా తక్కువ మార్కులు పొందితే అనుతీర్ణులుగా పరిగణిస్తారు. ఆ విద్యార్థి మళ్లీ పబ్లిక్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే గతంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
-
గుణాత్మకాంశాలు: సాధారణంగా ప్రశ్నలు పాఠ్య పుస్తకంలోని విషయానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం తరగతి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా సంవత్సరంలో సాధించాల్సిన విద్యా ప్రమాణాలను నిర్ధారించడమైంది. వీటి ఆధారంగానే ప్రశ్నపత్రాల తయారీ ఉంటుంది.

సామర్థ్యాలు-విద్యా ప్రమాణాలు:
-
పదో తరగతి గణితంలో కింది సామర్థ్యాలను/విద్యా ప్రమాణాలను నిర్ధారించారు. అవి:
సమస్య సాధన:
-
కింది సందర్భాలతో కూడిన సమస్యలను సమస్య సాధనకు అడగవచ్చు. పద సమస్యలు, పట సమస్యలు, దత్తాంశ అవగాహన-విశ్లేషణ సమస్యలు, పట్టికలు, గ్రాఫ్‌కు సంబంధించిన సమస్యలు.

కారణాలు చెప్పడం – చేయడం:
-
కింది సందర్భాలతో కూడిన సమస్యలను కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అడగవచ్చు. నిరూపించండి, సరిచూడండి, సమర్థించండి? ఉదాహరణలివ్వండి, వివరించండి, ఎందుకు? ఎలా? మొదలైన ప్రశ్నలు

వ్యక్తపర్చడం:
-
సాధారణంగా వ్యక్తపర్చడం అనే సామర్థ్యం కోసం కింది అంశాలతో కూడిన సమస్యలు అడగవచ్చు.
-
గణిత వాక్యాలను పద సమస్యలుగా మార్చడం, పదసమస్యలను గణిత వాక్యాలుగా మార్చడం.
-
దత్తాంశం నుంచి పట్టికలు తయారు చేయడం.
-
గణితపరమైన ఆలోచనలను తమ సొంత మాటల్లో వివరించమని, అలాగే సమస్యలు ఫార్ములాలతో గుర్తులను వివరించమని అడిగే ప్రశ్నలు.
అనుసంధానం:
-
ఈ సామర్థ్యం కింద అడిగే ప్రశ్నలు గణితంలోనే ఒక రంగాన్ని మరొక రంగంతో అనుసంధానం చేసే ప్రశ్నలు, గణితాన్ని ఇతర సబ్జెక్టులతో అనుసంధానం చేసే సమస్యలు, వేర్వేరు భావనలను, బహుళ పద్ధతులను అనుసంధానం చేయగల సమస్యలు ఉంటాయి.
-
ఉదా: 4.2 సెం.మీ వ్యాసార్థం కలిగిన ఒక లోహపు గోళాన్ని కరిగించి 6 సెం.మీ వ్యాసార్థం కలిగిన స్థూపంగా మలిస్తే ఆ స్థూపం ఎత్తు ఎంత?

ప్రాతినిధ్యపర్చడం-దృశ్యీకరణ:
-
ఈ సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలు కింది సందర్భాలతో కూడి ఉంటాయి. నిర్మాణాలు, పట్టికలు, గ్రాఫ్‌ల నుంచి సమాచారం చదవడానికి ఉద్దేశించిన సమస్యలు, సంఖ్యారేఖాపై సూచించే ప్రశ్నలు, పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు, ద్విమితీయ (2D), త్రిమితీయ (3D) పటాలు చదువుకోవడానికి ఉద్దేశించిన సమస్యలు.

ప్రశ్నల స్వభావం:
-
ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు ఆలోచించి రాసేలా ఉంటాయి. విశ్లేషించి భావనలను అన్వయించి, సాధించేలా ఉంటాయి. కొన్ని ప్రశ్నలు బహుళ సమాధానాలు వచ్చేలా ఉంటాయి.

పరీక్షకు సిద్ధమవ్వడం ఎలా?
- అధ్యాయాల వారీగా ముఖ్యనిర్వచనాలు, ఫార్ములాలు గుర్తుకు తెచ్చుకొని ప్రతి అభ్యాసంలోని ప్రశ్నలతో పాటు ఇవి చేయండి. ఆలోచించుకొని చర్చించి రాయడం లాంటి ప్రశ్నలతో పాటు ఉదారహరణ సమస్యలను సాధించాలి. ప్రతి అధ్యాయంలో ముఖ్య నిర్వచనాలు, ఫార్ములాలు, ముఖ్య ఇతర అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.

- ప్రతి సమస్యను అర్థం చేసుకొని సమస్యలో ఇచ్చిన అంశాలను తెలుసుకుని కనుక్కొవాల్సిన అంశాలేవో గుర్తించి సాధన చేయాలి. బహుపదులు, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, గ్రాఫ్‌లను తప్పనిసరిగా వేర్వేరు సమస్యలను సేకరించి సాధించాలి. సరూప త్రిభుజాల నిర్మాణం, వృత్తానికి స్పర్శరేఖల నిర్మాణాలను కూడా కచ్చితత్వాన్ని పాటిస్తూ సాధన చేయాలి.

- వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను విపులంగా సోపానాల మధ్య అనుసంధానం ఉండేలా సాధన చేయాలి. లఘు సమాధాన ప్రశ్నలు, అతి లఘు సమాధాన ప్రశ్నలు క్లుప్తంగా, సూటిగా ఫార్ములా ఆధారంగా లేదా తగిన కచ్చితమైన కారాణాలతో సాధించాలి. గణిత సమస్యల సాధనలో స్పష్టత, కచ్చితత్వం చాలా ముఖ్యం.

పరీక్ష రాయడం ఎలా?
- చాలామంది తెలివైన విద్యార్థులు కూడా పబ్లిక్ పరీక్షల్లో తక్కువ మార్కులు పొందుతారు. కొంతమంది సగటు విద్యార్థులు అధిక మార్కులు పొందుతారు. కారణం పరీక్ష రాసే విధానం. పరీక్షలో మీకు ఇచ్చిన మొదటి 15 నిమిషాలు కచ్చితంగా ప్రశ్నపత్రం చదవడానికి కేటయించాలి. సమయంలో ముందుగా తేలికైన ప్రశ్నలను గుర్తించి రాయడానికి సిద్ధం కావాలి. కఠినతరమైన ప్రశ్నలను కూడా ఎలా సాధించవచ్చో ఆలోచించాలి.

- సమాధానాలు రాసేటప్పుడు కచ్చితంగా మొదటి ప్రశ్ననే రాయాలనే నిబంధన ఏదీ లేదు. మీకు తెలిసిన, తేలికైన, కచ్చితంగా సమాధానం వచ్చు అనే ప్రశ్నలను ముందుగా సాధించాలి. సమాధానంలో స్పష్టత, సోపానాలు మధ్య అనుసంధానం ఉండేలా చూసుకోవాలి. కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉండకపోతే మీకు విషయ అవగాహన ఉందనే విషయం పరీక్షల ముల్యాంకానాధికారికి అర్థమవుతుంది. తద్వారా మంచి మార్కులు రాబట్టుకోవచ్చు.

- అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. కష్టమైన సమస్యలను సైతం సాధించే ప్రయత్నం చేయాలి. ఏదీ వదిలిపెట్టవద్దు, రెండు గంటల వ్యవధిలో ప్రశ్నపత్రం పార్ట్- పూర్తయ్యేలా చూసుకోవాలి. పార్ట్-బీ బహుళైచ్ఛిక ప్రశ్నలతో సమాధానం , బీ, సీ, డీలతో ఏదో ఒకదాన్ని మాత్రమే గుర్తించి స్పష్టంగా పెన్తో రాయాలి. పెన్సిల్ను వాడకూడదు.

- చివరి పది నిమిషాల్లో సమాధాన పత్రాన్ని మరోసారి నిశితంగా పరిశీలించి అన్ని ప్రశ్నల సంఖ్యలను ఎడమవైపు మార్జిన్లో స్పష్టంగా రాశారో లేదో చూసుకోవాలి. అదనపు పత్రాలను, ప్రధాన సమాధాన పత్రం వెనుక తర్వాత గ్రాఫ్ పేపర్, చివరన పార్ట్-బీ పత్రాన్ని అమర్చాలి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS