Sunday, 15 April 2018

Tips To Get Pass Marks In Biological Science For 10th Class Students


Tips To Get Pass Marks In Biological Science For 10th Class Students
10వ తరగతి విద్యార్థులు బయోలజికల్ సైన్సు లో పాస్ మార్కులు పొందడం ఎలా

- ప్రకృతిని పరిశీలించడం, మానవ శరీర ధర్మాలను అవగాహన చేసుకుంటే చాలు ప్రతి ప్రశ్నకు సమాధానం రాయవచ్చు. విద్యాప్రమాణాలకు అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే అత్యధిక మార్కులు సాధించవచ్చు. పదోతరగతి బయాలజీ సిలబస్ పరిశీలిస్తే మొత్తం 10 యూనిట్లు (అధ్యాయాలు) ఉన్నాయి.
అవి.
1. పోషణ - ఆహార సరఫరా వ్యవస్థ
2.
శ్వాసక్రియ - శక్తి ఉత్పాదక వ్యవస్థ
3.
ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ
4.
విసర్జన - వ్యర్థాల తొలగింపు వ్యవస్థ
5.
నియంత్రణ - సమన్వయ వ్యవస్థ
6.
ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ
7.
జీవక్రియల్లో సమన్వయం
8.
అనువంశికత
9.
మన పర్యావరణం - మన బాధ్యత
10.
సహజవనరులు
-
పైన పేర్కొన యూనిట్లలో అనువంశికత తప్ప మిగిలిన అన్ని పాఠాలను కింది తరగతుల్లో కొంత అధ్యయనం చేశారు. సీసీఈ విధానంలో అధ్యాయాల వారీగా వెయిటేజీ ఉండదు.
-
మొత్తం 40 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 4 సెక్షన్లు.
-
వ్యాసరూప ప్రశ్నలు 4 x 4 = 16 ( ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది)
-
సంక్షిప్త రూప ప్రశ్నలు 6 x 2 = 12 మార్కులు (ఇంటర్నల్ చాయిస్ ఉండదు)
-
ఒక మార్కు ప్రశ్నలు 7 x 1 = 7 మార్కులు (ఇంటర్నల్ చాయిస్ ఉండదు)
-
ఆబ్జెక్టివ్ ప్రశ్నలు - 10 x 1/2 = 5 మార్కులు
-
సబ్జెక్టులో సులభంగా 40కి 40 మార్కులు సాధించవచ్చు.
-
అన్ని అధ్యాయాలను పరిశీలిస్తే అవి నిత్యజీవితంతో ముడిపడి ఉన్నవి అన్నది స్పష్టమవుతుంది. బట్టీపట్టాల్సిన అవసరం లేదు. మన శరీరంలోని ప్రతి భాగం పనిచేసే విధానం సమగ్రంగా తెలుసుకొని దానికి అక్షర రూపం ఇస్తే చాలు.
-
చివరి రెండు యూనిట్లు మన చుట్టూ ఉన్న అంశాలే. కాబట్టి నిత్యం చేసే, చూసే అంశాలతో పాఠాలను అన్వయం చేసుకొంటూ చదివితే సులభంగా జవాబులు రాయగలరు.
-
రేఖా చిత్రాలు, ఫ్లోచార్ట్స్, పటాలు, టేబుల్స్ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
-
ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, బొమ్మలు గీయడం, మోడల్స్ తయారు చేయడం వంటి అంశాలు, విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం వంటి అంశాలతో ప్రశ్న పత్రం ముడిపడి ఉంది.
- కాబట్టి మూస పద్ధతిలో బట్టీపట్టకుండా శరీర భాగాలు - పనితీరు - వ్యవస్థ - నియంత్రణ - ప్రకృతి అంశాలను సమగ్రంగా అర్థం చేసుకొంటేచాలు. పూర్తిస్థాయిలో బయాలజీలో మార్కులు సాధించవచ్చు. సిలబస్లోని ప్రతి అధ్యాయం మానవ జీవితంతో ప్రత్యక్ష సంబంధం కలిగినదే కాబట్టి వాటిపై అవగాహన తప్పనిసరి. వాటిని అర్థం చేసుకొని, అప్లయ్ చేస్తే చాలు.
-
పాఠం చదవటంతోపాటు రివిజన్కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. మైండ్మ్యాప్లను గీయడం నేర్చుకొని పాఠ్యాంశాలను నేర్చుకొంటే అంశాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.
-
పటాలను చక్కగా, నీట్గా గీయడం, భాగాలను గుర్తించడం ముఖ్యం.
-
పాఠాలను ఎక్కువసార్లు రివిజన్చేసుకోవటం, పటాలను ప్రాక్టీస్ చేయడం మార్కుల సాధనలో కీలకం.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS