Sunday, 15 April 2018

Questions Answers on Teacher’s Service Rules Part-1


👇👇 Questions and Answers on Teacher’s Service Rules Part-1 👇👇
👇👇 ఉపాద్యాయుల సర్వీస్ కు సంబందించిన సందేహాలు సమాధానాలు పార్ట్-1 👇👇

ప్రశ్న: నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను. సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?
జవాబు: వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ-ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.

ప్రశ్న: నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను. ఇంటర్, డిగ్రీ, హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు. ఎందుకని?
జవాబు: మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.

ప్రశ్న: ఒకే విద్యా సంవత్సరం లో రెండు కోర్సులు చేయవచ్చా?
జవాబు: ఒకే విద్యా సంవత్సరం లో ఒక రెగ్యులర్ కోర్సు, ఒక దూర విద్యా కోర్సు చేయటానికి అనుమతి ఇవ్వండి, అంతేగానీ రెండు రెగ్యులర్ కోర్సులు చేయడానికి అనుమతి ఇవ్వవద్దని యూజీసి 28.12.12 న అన్ని యూనివర్సిటీ లకి లేఖ రాసింది.

ప్రశ్న: నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను. నాకు పెన్షన్ ఎంత వస్తుంది?
జవాబు: చివరి ములవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.

ప్రశ్న: ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు. అతనికి ఎన్ని ELs జమచేయబడతాయి?

జవాబు: వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.

ప్రశ్న: మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో, ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు. ఎవరు మాలో సీనియర్ అవుతారు?

జవాబు: సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.

ప్రశ్న: FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా?

జవాబు: FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.


ప్రశ్న: నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల?

జవాబు: జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.

ప్రశ్న: నేను, మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము. ఒకే రోజు జాయిన్ అయ్యాము. SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు?

జవాబు: SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే, వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS