Sunday, 15 April 2018

Leave Sanction Power


🔥🔥 Competent Authorities For Sanction Of Leaves To Teachers 🔥🔥
🔥🔥 ఉపాధ్యాయుల వివిధ రకాల సెలవులు మంజూరు చేసే అధికారం ఎవరికి కలదు? 🔥🔥

👉 G.O.Ms.No.58 విద్య తేది:22-04-2008 ్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులు మంజూరు అధికారం, కాలపరిమితుల పై ఉత్తర్వులు ఇవ్వబడినవి.

👉 కాలక్రమేణ నియమాలను సవరిస్తూ G.O.Ms.No.70 విద్య తేది:06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరు ేయాలో తాజా మార్గదర్శకాలు జారీచేయబడినవి.

👉 ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:
👉 
ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరు చేస్తారు. 15 ఆకస్మిక సెలవులు, 7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు, ఒకేసారి ఆకస్మిక సెలవులు/ ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు  మించకుండా మంజూరు చేస్తారు.

👉 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:
👉ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఆకస్మిక/ ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/ అర్ధవేతన/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.

👉 ప్రసూతి సెలవు (Maternity Leave):
👉 మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల వరకు సెలవు మంజూరు చేసే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు  G.O.Ms.No.84 తేది:17-09-2012 ద్వారా కల్పించబడింది.

👉 మండల విద్యాధికారులు:
👉 తన పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథమిక/ ప్రాథమికోన్నత  పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/ అర్ధవేతన సెలవులు/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.

👉 ఉప విద్యాధికారి:
👉 తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల, ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథమిక/ ప్రాథమికోన్నత/ ఉన్నత పాఠశాలల  ప్రధానోపాధ్యాయులకు అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత/ అర్ధవేతన/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరుచేస్తారు.

👉 జిల్లా విద్యాధికారి:
👉 జిల్లాలోని ఉపవిద్యాధికారులకు, మండల విద్యాధికారులకు ఆకస్మిక/ ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/ అర్ధవేతన, కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం వరకు మంజూరు చేయవచ్చును. జిల్లాలోని అన్ని ప్రాథమిక/ ప్రాథమికోన్నత/ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి 1 సంవరకు అన్ని రకాల సెలవులు మంజూరు  చేస్తారు.

👉 డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్:
👉 మండలవిద్యాధికారులకు/ ఉన్నత/ ప్రాథమికోన్నత/ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను 1 సంనుండి 4 సంవరకు సెలవు మంజూరు చేస్తారు.

👉 కొన్ని ముఖ్యాంశాలు:
🔮 సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.
🔮 సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో వీధుల్లో చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.
🔮 నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4 కేటగిరీకి బదిలీచేస్తారు.
🔮 అధికంగా వాడుకున్న సెలవును FR-18 ప్రకారం అనధికార గైర్హాజరుగా భావించి డైస్ నాన్ గా ప్రకటిస్తారు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS