Sunday, 15 April 2018

How To Get Pass Marks In Physical Science For 10th Class Students


🔥 How To Get Pass Marks In Physical Science For 10th Class Students 🔥
🔥 10వ తరగతి విద్యార్థులు ఫిజికల్ సైన్సు లో పాస్ మార్కులు పొందడం ఎలా 🔥

👉 విద్యార్థులు ఫిజికల్ సైన్సు అంటే ఆందోళన పడుతుంటారు. కానీ దీన్ని అవగాహన చేసుకొంటే చాలా సులభంగా అర్థమవుతుంది. పుస్తకంలోని పాఠ్యాంశాలను గమనించినట్లయితే.. ఈజీగా మార్కులు సాధించే కొన్ని అంశాలను గుర్తించి సరైన ప్రణాళికతో చదివితే సగటు విద్యార్థి కూడా కనీసం 14 మార్కులతో పాస్ కావచ్చు.


👉 గత మూడేండ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు అనే విద్యాసామర్థ్యం నుంచి కచ్చితంగా 4 మార్కుల ప్రశ్న వస్తుంది. దానికి అనుగుణంగా పుస్తకంలోని ప్రయోగశాల కృత్యాలు (దర్పణాలు, కటకాల నాభ్యాంతరం కనుగొనే ప్రయోగం, ఓమ్ నియమాన్ని నిరూపించే ప్రయోగం, అయర్‌స్టెర్ ప్రయోగం, ఆమ్ల ద్రావణాలు విద్యుద్వాహకతను ప్రదర్శించే ప్రయోగం, ఇనుము తుప్పుపట్టే సందర్భాలకు సంబంధించిన ప్రయోగం) కొన్ని ఇతర ప్రయోగాలు వాటికి సంబంధించిన పరికరాలు, ప్రయోగ విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించి 4 మార్కులు సులభంగా పొందవచ్చు.


👉 అదేవిధంగా మరొక 4 మార్కుల ప్రశ్న సమాచార సేకరణ నైపుణ్యం అనే విద్యాసామర్థ్యం నుంచి వస్తున్నది. దీనిలో పట్టిక రూపంలో కొంత సమాచారం ఇచ్చి దాని ఆధారంగా 4 ప్రశ్నలు అడుగుతున్నారు.

👉 బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం అనే విద్యాసామర్థ్యం నుంచి ఒకటి ఒక మార్కు ప్రశ్న, ఒకటి రెండు మార్కుల ప్రశ్న వస్తున్నది. దర్పణాలు, కటకాలు వివిధ సందర్భాల్లో ఏర్పరిచే ప్రతిబింబానికి సంబంధించిన కిరణ చిత్రాలు, దృష్టి లోపాలకు సంబంధించిన (దీర్ఘదృష్టి, హ్రస్వదృష్టి) కిరణ చిత్రాలు.. విద్యుత్ ప్రవాహం పాఠం నుంచి వలయాలకు సంబంధించిన డయాగ్రంలు, దండయస్కాంతం ఏర్పరిచే బలరేఖలు, గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం, విద్యుత్ ప్రవాహం, విద్యుత్ అయస్కాంతత్వం చాప్టర్స్‌పై దృష్టి ఎక్కువగా పెట్టాలి.


👉 సీసీఈ పద్ధతి ప్రకారం అన్ని అధ్యాయాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి సమాన పట్టు ఉండాలి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే పూర్తిగా అప్లికేషన్ ఓరియంటెడ్, ఎక్స్‌పరిమెంటల్, ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రశ్నలు ఇస్తున్నారు. నిత్యజీవితంతో సంబంధం ఉన్న ప్రశ్నలు, ఆలోచించి రాసే ప్రశ్నలు ఇస్తున్నారు. వీటికోసం తార్కికంగా ప్రిపరేషన్ కొనసాగించాలి.


👉 ఎక్కువ మంది కష్టమని భావించే అధ్యాయాలు ప్రిన్స్‌పుల్స్ ఆఫ్ మెటలర్జీ (లోహసంగ్రహణ శాస్త్రం), కార్బన్, కర్బన సమ్మేళనాలు. వీటిలో ప్రాథమిక అంశాలను ఆకళింపు చేసుకుంటే సులభంగా సమాధానాలు రాయవచ్చు.

👉 డయాగ్రమ్స్ విషయానికి వస్తే లూయిస్ చుక్కలు, మొల్లర్ డయాగ్రమ్, s, p, d ఆకృతులు. హైబ్రిడైజేషన్‌లో CH4, H2O, NH3, BF3, BeCl2, N2O2, C2H2 తదితరాలు. ప్రాత్ ప్లోటేషన్, మ్యాగ్నటిక్ సపరేషన్, డైమండ్, గ్రాఫైట్ ఆకృతులు
నేర్చుకోవాలి. లోహసంగ్రహణం నుంచి ప్లవన ప్రక్రియ డయాగ్రం, బ్లాస్ట్ కొలిమి, రివర్టరేటరీ కొలిమికి సంబంధించిన డయాగ్రంలు, మిసిలి డయాగ్రం ప్రాక్టీస్ చేయాలి.


👉 లాంగ్ ఆనర్స్‌లో కార్బన్, కర్బన సమ్మేళనాలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, మూలకాల ఆవర్తన పట్టిక చాప్టర్స్‌పై దృష్టి సారించాలి.

👉 రసాయన సమీకరణాలు, తుల్యం చేయడం, మోల్ కాన్సెప్ట్, సమస్యలు. క్వాంటం నంబర్స్, ఆఫ్‌బౌ, పౌలీ, హూండ్స్ సూత్రాలు నేర్చుకోవాలి.

👉 1- 30 మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి.

👉 అదేవిధంగా సమీకరణాలను తుల్యం చేయడం నేర్చుకోవడం ద్వారా 2 నుంచి 4 మార్కులు సంపాదించవచ్చు. అంతేగాకుండా సగటు విద్యార్థి కూడా సులభంగా అర్థం చేసుకునే పాఠ్యాంశాలు ఆమ్లాలు- క్షారాలు, పరమాణు నిర్మాణంలో అటామిక్ రేడియస్, ఐనోజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టికల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ప్లానింగ్‌తో ప్రిపేరయితే ఫిజికల్ సైన్స్‌లో 15 నుంచి 20 మార్కులు సులభంగా పొందవచ్చు.

👉 పై అన్నింటితోపాటు మంచి చేతి దస్తూరి తప్పనిసరి. సంఖ్యలు, అక్షరాలు అర్థమయ్యే విధంగా నీట్‌గా రాయాలి. కొట్టివేతలు ఉండకూడదు. బొమ్మలు గీసినప్పుడు జాగ్రత్తగా, శుభ్రంగా గీయాలి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS