Sunday, 15 April 2018

CPS Fund Partial Withdrawal Procedure


💥💥 CPS Fund Partial Withdrawal Procedure 💥💥
💥💥 CPS ఫండ్ పాక్షిక ఉపసంహరణ చేసే విధానము 💥💥

👉 కాంట్రీబ్యూటరీ పెన్షన్ పథకం లో జమ ఐన ఉద్యోగుల పెన్షన్ ఫండ్ పాక్షిక ఉపసంహరణ (పార్శియల్ విత్ డ్రాయాల్) నిబందనలను పెన్షన్ ఫండ్ రేగులేటరి అథారిటి (PFRDA) Circular No. PFRDA/2018/40/EXIT; Dt:10.01.2018 ద్వార జారి చేసింది.

👉 ఈ సర్క్యులర్ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరి అండ్ డెవలప్ మెంట్ అథారిటి (నేషనల్ పెన్షన్ సిస్టం క్రింది మినహాయింపులు మరియు ఉపసంహరణ) (మొదటి సవరణ ) రెగ్యులేషన్స్ 2017 www.egazette.nic.in వెబ్ సైట్ నందు ప్రచురించబడింది. దీని
ద్వార CPS ఫండ్ పాక్షిక ఉపసంహరణ నిబందనలు సరళీకృతం అయ్యాయి. ఇవి తేది. 10.08.2017 నుండి అమలులోకి వస్తాయని తెలియచేయబడింది.

👉 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరి అండ్ డెవలప్ మెంట్ అథారిటి (నేషనల్ పెన్షన్ సిస్టం క్రింది మినహాయింపులు మరియు ఉపసంహరణ) (మొదటి సవరణ ) రెగ్యులేషన్స్ 2017 లోని రెగ్యులేషన్ 8 ప్రకారం జాతీయ పెన్షన్ సిస్టం (NPS) క్రింద నిబందనల మేరకు అనుమతిస్తారు.

👉 పాక్షిక ఉపసంహరణకు చందా దారుడు దరఖాస్తు చేసిన నాటికి చందా దారుడు తన వాటాగా చెల్లించిన మొత్తంలో 25% మించని మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వ వాటాగా చెల్లించిన 10% మొత్తం నుండి పాక్షిక ఉపసంహరణకు అనుమతించరు.
A) పాక్షిక ఉపసంహరణకు షరతులు:
1. చందాదారుని పిల్లలు లేదా చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి
2. చందాదారుని పిల్లలు లేదా చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల వివాహం కొరకు
3. చందాదారుడు సొంతంగా కాని లేదా జీవిత భాగస్వామి తో కలిసి గాని నివాస గృహం లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం కొరకు (పూర్వికుల ఆస్తి కాకుండా చందాదారుడు వ్యక్తి గతంగా కాని ఉమ్మడిగా కాని గృహం లేదా ఫ్లాట్ కలిగి ఉంటే ఉపసంహరణకు అనుమతించరు)
4. చందాదారుడు లేదా జీవిత భాగస్వామి, పిల్లలు, దత్తత పిల్లలు, ఆధారిత తల్లి తండ్రులు ఈ దిగువ వ్యాధులతో అనారోగ్యమునకు గురై చికిత్స పొందుచున్నప్పుడు వైద్య చికిత్సల కొరకు
1. Cancer
2. Kidney Failure (End Stage Renal Failure)
3. Primary Pulmonary Arterial Hypertension
4. Multiple Sclerosis
5. Major Organ Transplantation
6. Coronary Artery Bypass Craft
7. Aorta Graft Surgery
8. Heart Valve Surgery
9. Stroke
10. Myocardial Infarction
11. Coma
12. Total Blindness
13. Paralysis
14. Accident of Serious/ Life Threatening Nature
15. Any other critical of a life-threatening nature as stipulated in the circulars, guidelines or notifications issued by the Authority from time to time.

B) పాక్షిక ఉపసంహరణకు పరిమితులు:
పాక్షిక ఉపసంహరణకు ఈ క్రింది పరిమితులకు లోబడి అనుమతిస్తారు.
1. చందాదారుడు జాతీయ పెన్షన్ పథకం లో చేరిన తేది నుండి మూడు సంవత్సరములు పూర్తి అయి ఉండాలి.
2. దరఖాస్తు చేసిననాటికి చందాదారుడు చెల్లించిన మొత్తానికి 25% మించని మొత్తాన్ని అనుమతిస్తారు.

C) గరిష్ట కాలపరిమితి:
1. జాతీయ పెన్షన్ పథకం కాలపరిమితి ముగిసేలోపు గరిష్టంగా మూడు సార్లు మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.
2. పాక్షిక ఉపసంహరణకై చందాదారుడు సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ (CRA) లేదా నేషనల్ పెన్షన్ సిస్టం ట్రస్ట్ కు తగిన దృవీకరణ పత్రాలతో నోడల్ అధికారి ద్వార దరఖాస్తు చేయాలి.
3. చందాదారుడు ఏదేని అనారోగ్యం తో బాధపడుచున్న సందర్బం లో వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయవచ్చు.

D) పాక్షిక ఉపసంహరణ విధానము:
చందాదారుడు తమ పాక్షిక ఉపసంహరణ (పార్శియల్ విత్ డ్రాయాల్) కొరకు FORM 601PW ఉపయోగించాలి.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS