Sunday, 15 April 2018

Compassionate Appointments Information


💥💥 Compassionate Appointments Information 💥💥
💥💥 కారుణ్య నియామకాలకు సంబందించిన సమాచారం 💥💥

1. ఉద్యోగి చనిపోయిన తేదీ నుండి ఒకసంవత్సరం లోపల కారుణ్య నియామకం కోసం కుటుంబసభ్యులు అప్లై చేసుకోవాలి. 

2. ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నా, 7సంవత్సారాలకు మించి కన్పించకుండా పోయిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబసభ్యులు కారుణ్య నియామకాలకు అర్హులే. 

3. అవివాహఉద్యోగి చనిపోతే వారి కుటుంబంలో ఎవరు సంపాదన పరులు లేకపోతే తమ్ముడు కానీ చెల్లెలు కానీ కారుణ్య నియామకానికి అర్హులు. 

4. ఉద్యోగి చనిపోయిన లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ జరిగిన వారి పిల్లలు 16 సంవత్సరాలు ఉన్న ఉద్యోగానికి అర్హులే, వీరికి లాస్ట్ గ్రేడ్ ఉద్యోగంలో తాత్కాలికంగా నియామకం చేసి 18 సంవత్సరాలు నిండినాక పూర్తిస్థాయి నియామకం చేస్తారు.

5. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యుల పోషణ భాద్యత విధిగా చూడాలి, నిర్లక్ష్యం చేసిన వారిని Govt. Circular Memo No. 58226-A/2002-2 GAD (Service-A) Department Dt. 01.05.2001 ప్రకారం ఉద్యోగంలో నుండి తొలగించే అవకాశం ఉంది.

6. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తి Govt. Circular Memo No. 40130/Service-G/2009-1 GAD (Service-A) Dept. Dt. 18.06.2010 ప్రకారం నిర్దేశిత నియమ నిబంధనల మేరకు పునర్వివాహం చేసుకున్నా కూడా ఉద్యోగంలో కొనసాగవచ్చు. 

7. కారుణ్య నియామకాల కోసం కావలసిన సర్టిఫికెట్లు :
కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసే సమయంలో అప్లికేషన్ తో పాటు జత చేయాల్సిన పత్రాలు. 
1. Death Certificate
2. Affidavit Certificate (No Objection Certificate)
3. Individual Application
4. Family Members Certificate
5. Employment Card
6. Qualification Certificate
7. SSC Certificate
8. Bonafide Certicate
9. No Earning Certificate
10. Residential Certificate
11. Caste Certificate (other than OC)
12. No Property Certificate   
13. Financial Status Certificate (by RDO)
మరణించిన ఉద్యోగి పనిచేసిన కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి.

8. మెడికల్ ఇన్వాలిడేషన్ పైన రిటైర్మెంట్ కి అనుమతించే వ్యాధులు :
a. పక్షవాతం
b. అంతిమ దశలో ఉన్న మూత్ర పిండముల వ్యాధి  
c. అంతిమ దశలో ఉన్న కాలేయ వ్యాధి 
d. క్యాన్సర్ వ్యాధి 
e. మానసిక వ్యాధి
f. పార్కిన్సన్ వ్యాధి 

9. మెడికల్ ఇన్వాలిడేషన్ పైన రిటైర్మెంట్ కావాలి అనుకునే వారు కమిటీకి పంపవలసిన వివరములు:
a. మెడికల్ ఇన్వాలిడేషన్ పొందే ఉద్యోగి పేరు 
b. ఉద్యోగి పనిచేసున్న శాఖా, హోదా, స్కేల్ అఫ్ పే 
c. క్రమ శిక్షణ చర్యలు పెండింగులో ఉన్నాయా 
d. ఉద్యోగి సర్వీస్ రెగ్యులర్ అయ్యిందా 
e. పుట్టిన తేదీ 
f. పుట్టిన తేదీ ప్రకారం ఉద్యోగ విరమణ తేదీ 
g. వ్యాధి వివరములు 
h. ఆ వ్యాధి GO.Ms. No: 661 GAD Dt. 23.10.2008 ్రకారం ఉందా 
i. వ్యాధి చికిత్స కోసం ఉద్యోగి సెలవు పై ఉన్నారా ఉంటె ఆ వివరాలు 
j. మెడికల్ బోర్డువారి సిపార్సులు 
k. శాఖా పర సిపార్సులు 

Note: మరణించిన ఉద్యోగి పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం చేస్తున్న సందర్భంలో కొంతవరకు స్థిరాస్తి, భూములు, ఇల్లు తదితరములు ఉన్నప్పటికీ వాటి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ జీవనోపాధికి సరిపడ లేవని కారుణ్య నియామకాలు చేయు అధికారి భావిస్తే కుటుంబంలో ఒకరికి Govt. Memo No. 535/Service-A/91-1/G.A. (Service-A) Dept. Dt. 17.12.1979 ప్రకారం ఉద్యోగం ఇవ్వవచ్చు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS