Sunday, 15 April 2018

Child Care Leave


Child Care Leave
EXPLANATION:

శిశు సంరక్షణ సెలవు
వివరణ:

👉 మహిళా ఉద్యోగులు మరియు మహిళా టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశు సంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో:209 తేది:21-11-2016 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

👉 90
రోజుల శిశు సంరక్షణ సెలవును విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి.
👉 180
రోజుల ప్రసూతి సెలవుకు ఈ సెలవులు అదనం.
👉 ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు శిశు సంరక్షణ సెలవును అనుమతించాలి.
👉 40
శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.
👉 ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
👉 మహిళా ఉద్యోగుల, మహిళా టీచర్ల  పిల్లలు పూర్తిగా వారి (తల్లుల) పై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే శిశు సంరక్షణ సెలవును మంజూరుచేస్తారు.
👉 పిల్లల పరీక్షలు, అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు శిశు సంరక్షణ సెలవును మంజూరుచేయాలి. కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే శిశు సంరక్షణ సెలవును అనుమతించడం నిబంధనలకు విరుద్దం.

👉 శిశు సంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు. కేవలం సెలవు పత్రం సమర్పించి  శిశు సంరక్షణ సెలవు పై వెళ్ళకూడదు. అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్లాలి.
మొదటి విడత శిశు సంరక్షణ సెలవు మంజూరు సమయంలో పుట్టినతేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి. ఇతర రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.

👉 ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా రకమైన సెలవుతోనైనా కలిపి శిశు సంరక్షణ సెలవును వాడుకోవచ్చును.
👉 ఆకస్మికేతర సెలవు (OCL) కు వర్తించే ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధనలు సెలవుకు కూడా వర్తిస్తాయి.
👉 శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.
ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి. రెగ్యులర్ సెలవు ఖాతాకు సెలవు ఖాతాను కలుపకూడదు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS