Saturday, 10 February 2018

More Weight Of Students School Bags In Schools



🔥🔥 విద్యార్థులకు తప్పని భారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలు బుట్టదాఖలు 🔥🔥
🔥 🔥 ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు 🔥 🔥

👉  ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు 3-6 కేజీలు ఉంటే.. ఉన్నత పాఠశాలల్లో 6-12 కేజీలు ఉన్నట్లు తేలింది. ఇక, కేజీబీవీల్లో 5-10 కేజీలున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల అనే తేడా లేదు. ప్రతి విద్యార్థి అవసరానికి మించి పుస్తకాలు మోస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

👉 ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా విద్యార్థులకు బ్యాగుల మోత తప్పడం లేదని గుర్తించారు. పాఠశాల కూడా నిబంధనలు పాటించడం లేదని, ప్రభుత్వ ఉత్తర్వులను అన్ని పాఠశాలలు బుట్టదాఖలు చేస్తున్నాయని నిర్ధారించారు.

👉 ఇటీవల పాఠశాల విద్యా శాఖ చేపట్టిన పరిశీలనలో బ్యాగుల మోత బయటపడింది. 3 నుంచి 9 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1226 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ అంశాలపై 10 బృందాలు పరిశీలన చేశాయి.

👉 సందర్భంగా బ్యాగుల బరువుపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలకు వెళ్లినా విద్యార్థుల బ్యాగులు చిన్నపాటి కొండను తలపిస్తున్నాయని గుర్తించారు.

👉 ప్రైవేటు పాఠశాలలైతే కనీస నిబంధనలను కూడా పాటించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందన్న అభిప్రాయం కూడా తప్పని తాజా పరిశీలనలో తేలింది. ప్రతి విద్యార్థి వద్ద అవసరానికి మించి పుస్తకాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3 నోటుబుక్లు ఉన్నట్లు గమనించారు.

👉 వాటితోపాటు మధ్యాహ్న భోజనానికి ప్లేటు, మంచినీళ్ల బాటిల్, టిఫిన్బాక్సు, ప్యాడ్, కంపాక్స్బాక్సు, ఇతర సామగ్రి ఉన్నాయి. కొన్నిచోట్ల నిఘంటువు, జీకే పుస్తకాలు కూడా గుర్తించారు. బ్యాగుల బరువుపై వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో గత ఏడాది జూలై 18 ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

👉 స్థాయిలో బ్యాగు ఎంత బరువు ఉండాలి? ఏయే పుస్తకాలు తీసుకెళ్లాలి వంటి అంశాలను వాటిలో పేర్కొంది. నిబంధనలను పాఠశాల పాటించడం లేదు. అంతేనా, సర్కారు ఉత్తర్వులు ప్రభుత్వ పాఠశాలలకు కాదని డీఈవోలు, ఎంఈవోలు భావించినట్లు, కొందరు ప్రైవేటు పాఠశాలలకు వాట్సాప్ద్వారా పంపించి అమలు చేయాలని ఆదేశించినట్లు వెల్లడైంది. ఇటువంటి ఉత్తర్వులు వెలువడినట్లు కొంతమంది ఉపాధ్యాయులకు తెలియకపోవడం గమనార్హం.

👉 ఉత్తర్వులు జారీ చేయడం తప్ప, అంశంపై ప్రభుత్వం ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం విశేషం.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS