Saturday, 10 February 2018

Monthly Scholarship 70 – 80 Thousand Rupees For Research Scholars
🔥 నెలకు 70- 80 వేల ఉపకార వేతనం 🔥
🔥 పీఎంఆర్ఎఫ్పథకానికి కేబినెట్ఆమోదం 🔥
🔥 మేధోవలసలకు చెక్పెట్టడమే లక్ష్యం 🔥
🔥 ఏటా 1000 మంది రిసెర్చ్స్కాలర్లకు కేటాయింపు 🔥
🔥 ఐదేళ్లపాటు రిసెర్చ్గ్రాంటు కింద రూ.2 లక్షలు 🔥
🔥 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి 🔥

👉 అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా.. ఆఫ్రికా నుంచి యూరప్దాకా చాలా దేశాల్లో మన భారతీయులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. ఇది గర్వకారణమే అయినా.. మేధోవలస కారణంగా మన దేశం ఎంతగానో నష్టపోతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధోవలసను ఆపేందుకు మోదీ సర్కారు నడుం బిగించింది.

👉 ఐఐటీలు, ఐఐఎ్సఈఆర్లు, ఎన్ఐటీల్లోని మన ప్రతిభావంతులకు విదేశాల నుంచి అందే స్కాలర్షి్పలకు దీటుగా.. భారీస్థాయిలో స్కాలర్షిప్ఇచ్చే పీఎం రిసెర్చ్ఫెలోషిప్స్పథకానికి కేబినెట్ఆమోదం తెలిపింది. దీంట్లో భాగంగా మూడేళ్లపాటు ఏటా 1000 మంది విద్యార్థులకు.. పీహెచ్డీ కోర్సులు చేసేందుకు వీలుగా నెలకు దాదాపు రూ.70 వేల నుంచి 80 వేల దాకా ఉపకారవేతనంగా ఇవ్వనున్నారు!!

👉 అంతేకాదు.. వార్షిక పరిశోధన గ్రాంటు కింద రూ.2 లక్షల దాకా ఇస్తారు. వచ్చే మూడేళ్లలో పథకం కింద ఖర్చు చేసేందుకు రూ.1650 కోట్లు కేటాయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి పథకం అమల్లోకి వస్తుంది. అత్యంత అధునాతన శాస్త్ర, పరిశోధన రంగాల్లో మన యువత దేశీయంగా పరిశోధనలు కొనసాగించేందుకు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్జావడేకర్అన్నారు.

👉 పథకం కింద చేసే పరిశోధనలు మన దేశ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉంటాయని.. అదే సమయంలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యమైన ఫేకల్టీ అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించిన పథకంలో భాగంగా స్కాలర్షిప్పొందాలంటే.. విద్యార్థులకు క్యుములేటివ్గ్రేడ్పాయింట్ యావరేజ్‌ (సీజీపీఏ) 8.5గా ఉండాలి.

👉 పథకం కింద.. బీటెక్చివరి సంవత్సరంలో ఉన్నవారికి, పూర్తిచేసినవారికి, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎమ్మెస్సీ (సైన్స్అండ్టెక్నాలజీ) పూర్తిచేసినవారికి వారి అర్హతలను బట్టి ఐఐటీలు, ఐఐఎ్ససీలో పీహెచ్డీ చేసేందుకు ప్రవేశార్హత కల్పిస్తారు.

👉 పథకానికి అర్హులైనవారికి తొలి రెండేళ్లూ రూ.70 వేలు ఫెలోషి్పగా ఇస్తారు. మూడో సంవత్సరంలో రూ.75 వేలు, నాలుగు, ఐదు సంవత్సరాల్లో రూ.80 వేలు ఇస్తారు. అంతర్జాతీయ కాన్ఫ్రెన్స్ల్లో, సెమినార్లలో తమ పరిశోధన పత్రాలను సమర్పించడానికి అవసరమైన ప్రయాణ, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం ఐదేళ్లపాటు అదనంగా రూ.2 లక్షలు రిసెర్చ్గ్రాంటుగా ఇస్తారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS