Sunday, 21 January 2018

Om Prakash Rawat Appointed as the New Chief Election Commissioner



💥💥 కొత్త సీఈసీగా ఓం ప్రకాశ్ రావత్ నియామకం 💥💥

👉  నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. ఈ నెల 23 సీఈసీగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే.. ఎలక్షన్ కమిషన్ కొత్త కమిషనర్‌గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లావాసా నియమితులయ్యారు.

👉 ఈసీ కమిషనర్‌గా అశోక్ లావాసా కూడా ఈనెల 23నే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా అచల్ కుమార్ ఉన్నారు. ఆయన ఈనెల 23 రిటైర్ కానున్నారు. దీంతో ఆయన స్థానంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా 23న ఓపీ రావత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

👉 ఓం ప్రకాశ్ రావత్.. 1977 బ్యాచ్‌కు చెందిన మధ్య ప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆగస్టు 2015 లో ఆయన ఎలక్షన్ కమిషన్‌లో నియమితులయ్యారు. తన కెరీర్‌లో సెంట్రల్, స్టేట్ లేవల్‌లో ఆయన ఎన్నో ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను నిర్వర్తించారు. ఆయన వయసు 64 ఏండ్లు. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, పబ్లిక్ ఎంటర్ ప్రైజ్‌లో సెక్రటరీగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు.

👉  1993లో డిఫెన్స్ మినిస్ట్రీలో డైరెక్టర్‌గా పనిచేశారు. డిఫెన్స మినిస్ట్రీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన సౌత్ ఆఫ్రికాకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. ఐక్యరాజ్య సమితి ఎన్నికల అబ్జర్వర్‌గా ఆయన సౌత్ ఆఫ్రికాకు వెళ్లారు.

👉 1994లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వర్ణ వివక్ష కారణంగా వచ్చిన ఎన్నికల సమయంలో ఆయన అక్కడ పనిచేశారు.

👉  2004 నుంచి 2006 మధ్య అప్పటి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు లాల్ గౌర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఓపీ రావత్ పనిచేశారు. అడవుల హక్కులకు సంబంధించి ఆయన తీసుకున్న చొరవకు గాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆయనకు 2010లో ప్రైమ్ మినిస్టర్ అవార్డు దక్కింది.

👉 రూల్ ప్రకారం.. ఈసీ కాని సీఈసీ కాని ఆరు సంవత్సరాలు ఆ పదవిలో ఉంటారు. లేదా 65 ఏండ్లు వచ్చే వరకు పదవిలో ఉంటారు. రెండిట్లో ఏది ముందు వస్తే దాన్ని వాళ్లకు వర్తింపజేస్తారు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS