Friday, 26 January 2018

Monthly Rs. 7200 and Rs. 100 per Class



💥 క్లాసుకు రూ.100.. నెలకు రూ.7200 💥
💥 అరకొర వేతనాలతో.. డిగ్రీ గెస్ట్ఫ్యాకల్టీల అవస్థలు 💥
💥 పెండింగ్లోనే జీతాల పెంపు ప్రతిపాదనలు 💥

👉 క్షణం తీరిక లేదు.. దమ్మిడీ ఆదాయం ఉండదన్నట్లు తయారైంది డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ఫ్యాకల్టీల పరిస్థితి. ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే అంతకు మించిన బోధనతోపాటు.. బండ చాకిరీ చేస్తున్నా.. వీరికి నెలకు దక్కేది రూ. 7,200 మాత్రమే. కార్మిక చట్టాలతో.. ఒక దినసరి కూలీ సైతం రోజుకు రూ. 400 చొప్పున నెలకు కనీసం రూ. 12,000 సంపాదిస్తుంటే.. ఉన్నత చదువులు చదివిన తమ పరిస్థితి అటు కిందిస్థాయిలో పనిచేయలేక.. ఇటు అరకొర జీతాలతో బతుకుబండినీడ్వలేక రెంటికీ చెడ్డ రేవటిలా మారిందని డిగ్రీ గెస్ట్ ఫ్యాకల్టీలు వాపోతున్నారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల వేతనం నెలకు కనీసం రూ. 70 వేలుగా ఉంది. వారితో సమానంగా పనిచేసే గెస్ట్ఫ్యాకల్టీలకు మాత్రం.. అందులో పదోవంతే అందుతోంది. అదీ.. సెలవుల్లేకుండా పనిచేస్తేనే.

👉 ప్రస్తుతం వీరికి ప్రభుత్వం క్లాసుకు రూ. 100 చొప్పున గౌరవ వేతనం అందిస్తోంది. రోజుకు కనీసం మూడు క్లాసులు చెబితేనే అంతోఇంతో గిట్టుబాటవుతుంది. క్లాసులు వరసగా కాకుండా.. పిరియడ్ని బట్టి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదింటి వరకు ఉంటాయి. తరగతులకు తోడు.. కాలేజీల్లో ఎలాంటి ప్రతిఫలం లేని అకడమిక్పనులనూ వీరే చేయాల్సి ఉంటుంది. తెలంగాణలోని 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సుమారు 400 మంది గెస్ట్ఫ్యాకల్టీలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పోలిస్తే.. గురుకులాలు, ప్రభుత్వ ఇంటర్మీడియెట్కాలేజీల్లో గెస్ట్ఫ్యాకల్టీల పరిస్థితి మెరుగ్గా ఉంది.

👉 ఇంటర్గెస్ట్లెక్చరర్లకు క్లాసుకు రూ. 300 వస్తుండగా.. గురుకులాల్లో నెలకు రూ. 25,000 పారితోషకం లభిస్తోంది. ఇంటర్లో కాంట్రాక్టు లెక్చరర్లకు నెలకు రూ. 37,100, డిగ్రీలో రూ. 40,270 చొప్పున గౌరవవేతనం అందుతోంది.

👉 డిగ్రీ గెస్ట్ఫ్యాకల్టీల గౌరవ వేతనం క్లాసుకు రూ. 100 నుంచి రూ. 300లకు పెంచాలని నాలుగు నెలల క్రితమే విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఆర్థిక శాఖ కూడా దీనికి పచ్చజెండా ఊపింది. అయినా.. ఫైల్కు మోక్షం కలగడం లేదు.. సంబంధిత జీవో విడుదల కావడం లేదు. గెస్ట్ఫ్యాకల్టీలు దాదాపు 15 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

👉 ఏనాటికైనా జీతం పెరిగి, తమకూ మంచిరోజులు వస్తాయనే ఆశతో.. అలుపెరుగక పనిచేస్తున్నారు. ఇప్పుడున్న చాలీచాలని జీతాలతో కుటుంబాలను వెల్లదీయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. గెస్ట్ఫ్యాకల్టీల పరిస్థితిపై దృష్టి సారించాలిఅని తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ఫోరం అధ్యక్షుడు సీహెచ్కిశోర్కుమార్ అన్నారు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS