Monday, 29 January 2018

Midday Meals For Intermediate Students In Govt Junior Colleges💥 ఇంటర్విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 💥
💥 ఉచిత బస్పాసు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు 💥
💥 ఇప్పటికే ప్రవేశ రుసుం రద్ద సర్వత్రా హర్షాతిరేకాలు 💥
👉 ప్రభుత్వ జూనియర్కళా శాలలను బలోపేతం చేసే లక్ష్యంతో సర్కారు పలు చర్యలు తీసుకుం టున్నది. ఇప్పటికే ప్రవేశ రుసుము ను రద్దు చేయగా, తాజాగా మరో రెం డు వరాలు ప్రక టించింది. వచ్చే విద్యాసంవ త్సరం నుంచి కళాశాలల్లో మధ్యాహ్నభోజనంతో పాటు ఉచిత బస్పాస్సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
💥 ఆకలికేకలకు చెల్లు..
👉 జిల్లా, మండలకేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్కళాశాలల్లో చదివే విద్యార్థులంతా నిరుపేదలే. వీరంతా వివిధ గ్రామాల నుంచి బస్సులు, ఆటోల్లో ఉదయం 8 గంటలలోపే బయలు దేరి వస్తారు. చాలా మంది అల్పాహారం కూడా తినకుండానే కళాశాలలకు చేరుకుంటారు. మధ్యాహ్నం కల్లా ఆకలితో పేగు లు నకనకలాడుతున్నా నీళ్లు తాగుతూ సాయంత్రం దాకా గడుపుతారు. దీంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయే వారు. ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయంతో పూర్వజిల్లావ్యాప్తంగా వేలాది మంది ఇంటర్ విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఉచిత బస్సు పాసు కూడా ఇవ్వనుండడంపై సంతోషం వెల్లివిరుస్తున్నది.

💥 ఇప్పటికే ప్రవేశ రుసుము రద్దు..
👉 ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే ప్రవేశ రుసుమును రద్దుచే శారు. అంతకుముందు సైన్స్ గ్రూపులో చేరే విద్యార్థి రూ. 1100, ఆర్ట్స్గ్రూపు విద్యార్థులు రూ.500, వృత్తికోర్సుల విద్యార్థులు రూ. 1200 రుముసు చెల్లించేవారు.

💥 ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయి..
👉 ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ జూ ని యర్కళాశాలల్లో ప్రవేశరుసుం రద్దు చే సింది. తాజాగా మధ్యాహ్నభోజనం, ఉచిత బస్సు పాస్సౌకర్యం కల్పించబోతున్నది. ఫలితంగా సర్కారు కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశముంది.
- బీనారాణి, ఇంటర్మీడియట్జిల్లా అధికారి

💥 పేద విద్యార్థులకు ఎంతో మేలు..
👉 బస్పాస్ కోసం నెలకు రూ. 100 నుం చి రూ. 150 దాకా చెల్లిస్తున్నాం. మధ్యా హ్న భోజనం లేక పస్తులతో కాలం వెళ్లదీ స్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద వి ద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
-శ్వేత, విద్యార్థిని

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS