Sunday, 21 January 2018

Do Not Believe in Whatsapp One Dollar Fee Messages



💥💥 వాట్సాప్ ఫ్రీ కాదా..? ఇకపై డబ్బులు చెల్లించాలా..? 💥💥

👉 ''వాట్సాప్ ఇకపై ఫ్రీ కాదు. ఆ సేవలు వాడుకుంటున్నందుకు ఇకపై మీరు వాట్సాప్‌కు 1 డాలర్ ఫీజు చెల్లించాలి. వాట్సాప్ సేవలు మీ ఫోన్‌లో నిలిచిపోకుండా ఉండేందుకు వెంటనే కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి 1 డాలర్ ఫీజు చెల్లించండి..!'' ఇలా గనక మీకు వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయా..! అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని అస్సలు నమ్మకండి. వాటిని నమ్మి ఆ మెసేజ్‌లలో ఇచ్చిన లింక్‌లను క్లిక్ చేశారో.. ఇక అంతే సంగతులు. మీ ఫోన్‌లోకి వైరస్ వ్యాప్తి చెందుతుంది.

👉 వాట్సాప్ ఉచితం కాదు, దానికి డబ్బులు చెల్లించాలి.. అంటూ గతేడాది కూడా చాలా మంది యూజర్లకు పై విధంగా మెసేజ్‌లు వచ్చాయి. కానీ చివరకు ఈ విషయంపై వాట్సాప్ స్పష్టతనిచ్చింది.

👉 వాట్సాప్ ఎప్పటికీ ఉచితమేనని తెలియజేసింది. అయినప్పటికీ ఇప్పుడు తాజాగా మళ్లీ ఇలాంటి నకిలీ మెసేజ్‌లు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి. కనుక మీకు ఇలాంటి నకిలీ మెసేజ్‌లు వస్తే వెంటనే వాటని బ్లాక్ చేయండి. లేదా.. స్పామ్ కింద రిపోర్టు చేయండి..! అంతేకానీ వాటిని మాత్రం ఓపెన్ చేసి వైరస్‌తో ఇబ్బందులు కొని తెచ్చుకోకండి..!

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS