Wednesday, 17 January 2018

తెలంగాణలో గురుకులాలు భేష్‌ - కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌



👉 తెలంగాణలో గురుకులాలను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్జావడేకర్ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించారు.

👉 గురుకులాల వల్ల ప్రత్యేకంగా బాలికలకు లబ్ధి చేకూరుతోందని, తెలంగాణ మోడల్ను అన్ని రాష్ట్రాలు పాటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన సెంట్రల్అడ్వయిజరీ బోర్డ్ఆఫ్ఎడ్యుకేషన్‌ (కేబ్‌) సమావేశం అనంతరం జావడేకర్విలేకరులతో మాట్లాడారు.

👉 దేశవ్యాప్తంగా ప్లస్, ‘ప్లస్ప్లస్న్యాక్గుర్తింపు ఉన్న యూనివర్సిటీల్లో ఆన్లైన్డిగ్రీలు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. మూడేళ్ల రెగ్యులర్డిగ్రీలతో సమానంగా వీటిని పరిగణించనున్నట్లు తెలిపారు.

👉 దేశవ్యాప్తంగా ఒకే విధమైన బోధన ప్రణాళిక ఉండేలా, ప్రశ్నాపత్రాల తయారీ విషయంలో విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు. వచ్చే నెలలో నియమ, నిబంధనలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా పాఠశాలకు రాని విద్యార్థులను గుర్తించడంలో ఎదురయ్యే సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్డిజిటల్బోర్డ్ప్రారంభించేందుకు ఎలాంటి సమస్య లేదని అన్నారు.

👉 ఏడాది సెప్టెంబరు నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పాఠశాలకు రాని విద్యార్థులకు సంబంధించిన సబ్కమిటీ జనవరి 31లోగా పూర్తి స్థాయి నివేదికను సమర్పిస్తుందని అన్నారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS