Wednesday, 17 January 2018

ప్రమోషన్‌ వద్దంటున్న జేఎల్‌లు!



💥 💥 డిగ్రీ లెక్చరర్గా ప్రమోషన్ను వదులుకొని వెనక్కి క్యూ కడుతున్న జూనియర్లెక్చరర్లు 💥 💥

💥 💥 వేతనాలు, సౌకర్యాలు భారీగా తగ్గడమే కారణం 💥 💥

👉 రంగంలోనైనా.. ఉద్యోగికైనా ప్రమోషన్వస్తే సంతోషపడతారు.. ప్రభుత్వ జూనియర్లెక్చరర్ల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మాకు ప్రమోషన్వద్దు మొర్రోఅని వేడుకుంటున్నారు. ప్రమోషన్ద్వారా పెరగాల్సిన వేతనం, హోదా తగ్గుతుండడం తో.. ప్రమోషన్వచ్చిన వాళ్లు వెనక్కి వచ్చేందుకు క్యూ కడుతున్నారు. పరిస్థితికి ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలే కారణమని జేఎల్స్మండిపడుతున్నారు.

👉 సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్లెక్చరర్గా ఉండగా రూ.93,409 వేతనం అందుకున్న ఉద్యోగికి.. డిగ్రీ లెక్చరర్గా ప్రమోషన్పొందిన తర్వాత రూ.56,592 మాత్రమే వచ్చింది. అంటే ఉద్యోగి ప్రమోషన్పొందడం వల్ల రూ.36,817 వేతనం తగ్గింది. ప్రమోషన్పొందినవారంతా ఇలా రూ.15 వేల నుంచి రూ. 36వేల వరకు నష్టపోతున్నట్లు లెక్చరర్లు తెలిపారు.

👉 రాష్ట్రంలోని 402 జూనియర్ కాలేజీల్లో దాదాపు 1300 మంది లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 346 మందికి 2015లో డిగ్రీ లెక్చరర్లుగా ప్రమోషన్కల్పించారు. వారంతా మళ్లీ వెనక్కి రావడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 45 మంది తిరిగి వచ్చేయగా.. మరో 52 మంది దరఖాస్తు చేసుకున్నారు.

💥 💥 ఇదీ.. అసలు సమస్య 💥 💥
ప్రభుత్వ జూనియర్లెక్చరర్లకు రాష్ట్ర పేస్కేలు వర్తిస్తుంది. డిగ్రీ లెక్చరర్లకు మాత్రం యూజీసీ స్కేలు వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ప్రస్తుతం జేఎల్స్పేస్కేలు రూ.37,100 ఉండగా కేంద్రం ప్రకారం (యూజీసీ) డిగ్రీ లెక్చరర్ల పేస్కేలు రూ.29,000 ఉంది.

👉 డిగ్రీ లెక్చరర్గా ప్రమోషన్పొందిన జేఎల్స్కు యూజీసీ ప్రకారం రూ.29వేలే మూల వేతనం లభిస్తోంది. వాస్తవానికి ప్రమోషన్పొందిన వారికి జూనియర్లెక్చరర్గా ఉన్నప్పుడు ఎంతైతే మూల వేతనం ఉందో దానిపై పెంచాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లు పొందిన వారికి ఫిట్మెంట్ఫార్ములాను జారీ చేయాలి.

👉 కానీ, ప్రభుత్వం మాత్రం సుమారు రెండున్నరేళ్లుగా ఫిట్మెంట్ఫార్ములా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. దీనికితోడు డిగ్రీ లెక్చరర్గా ప్రమోషన్పొందిన తర్వాత జూనియర్కాలేజీలో చేసిన సర్వీసును లెక్కించడం లేదని తెలిపారు. కాగా.  

👉 డిగ్రీ లెక్చరర్లుగా ప్రమోషన్పొందిన జూనియర్లెక్చరర్లు.. అక్కడ చదువు చెప్పడం చేతకాక తిరిగి వచ్చేస్తున్నారంటూ ప్రభుత్వ జూనియర్లెక్చరర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై జూనియర్లెక్చరర్లు మండిపడుతున్నారు.

👉 బాధ్యత గల హోదాలో ఉండి, అదీ.. లెక్చరర్వృత్తి నుంచి వచ్చిన ఆయన విధంగా మాట్లాడడం తగదని, చేతనైతే తమ సమస్యలను పరిష్కరించి మాట్లాడాలని జీజేఎల్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి అన్నారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS