Wednesday, 24 January 2018

ప్రభుత్వ స్కూళ్లకు దాతల పేర్లు పెట్టే విధానాల్లో మార్పులు



👉 రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు దాతల పేర్లు పెట్టే విధానాలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల నిర్మాణానికి విరాళాలిచ్చే దాతల పేర్లు పెట్టే విధానాలను ప్రభుత్వం మార్చింది.

👉 పాఠశాల పేరు మార్చకుండా భవనానికి లేదా బ్లాక్‌కు మాత్రమే దాతల పేర్లను ప్రభుత్వం పెట్టనుంది. పాఠశాలల నిర్మాణానికి ఇచ్చే విరాళాల మొత్తం కూడా పెంచింది.

👉 ప్రాథమిక పాఠశాలలకు ఇచ్చే విరాళం రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, ప్రాథమికోన్నత పాఠశాల నిర్మాణానికి రూ. 7 లక్షల నుంచి రూ. 50 లక్షలకు, ఉన్నత పాఠశాలల నిర్మాణానికి ఇచ్చే విరాళం రూ. 10 లక్షల నుంచి రూ. కోటికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS