Wednesday, 17 January 2018

ప్రభుత్వ స్కూలు.. ప్రవేశాలకు క్యూ💥 అడ్మిషన్లకు డిమాండ్‌.. దొరికితే అదృష్టమే.. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలూ అక్కడే
💥 డిజిటల్బోధన.. బోధనేతర కార్యక్రమాలకూ ప్రాధాన్యం
💥 హాజరు, పరీక్ష ఫలితాలు.. అన్నీ ఆన్లైన్లో
💥 స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు.. హెచ్ఆర్డీ మంత్రి ప్రశంస
💥 మంత్రి హరీశ్చొరవ.. టీచర్ల సమష్టి కృషి

👉 స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడతారు. అక్కడ పిల్లలకు ప్రవేశం లభిస్తే.. తమ అదృష్టంగా భావిస్తారు. అయితే, అడ్మిషన్లు మొదలైన కొద్దిరోజుల్లోనే అక్కడ నో అడ్మిషన్బోర్డు వేలాడుతుంది. అలా అని ఇదేదో బడా కార్పొరేట్స్కూలేమో అనుకుంటే పొరపాటే! సాదాసీదా ప్రభుత్వ పాఠశాల. ఎన్నో ప్రభుత్వ స్కూళ్లలో ఏటికేడు విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే.. అక్కడ మాత్రం పెరుగుతోంది. ఇక్కడ చదివే పిల్లల్లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎంతోమంది ఉన్నారు. నాణ్యమైన బోధన మాత్రమే కాదు.. బోధనేతర కార్యక్రమాలకు పెద్దపీట వేస్తారు.

👉 కచ్చితమైన సమయపాలన, పాఠ్యప్రణాళికతో కూడిన బోధన, క్రమణశిక్షణకు మారుపేరుగా నిలిచిన విద్యాలయమే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్జిల్లా పరిషత్ఇంగ్లిష్మీడియం స్కూల్‌. మిగతా సర్కారు బడులకు ఆదర్శంగా నిలుస్తున్న స్కూల్కు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ.. ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, ఉపాధ్యాయుల అంకితభావం వల్ల ఇదంతా సాధ్యపడింది.

👉 2015 నుంచి ఉపాధ్యాయులు స్కూల్నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థుల దినచర్య ప్రార్థనకన్నా ముందే మొదలవుతుంది. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించి, మూర్తిమత్వం (పర్సనాలిటి డెవల్పమెంట్‌) పెంపొందించేందుకు ఉదయం 9 నుంచి 9:30 వరకు సామూహిక ధ్యానం చేయిస్తారు. తర్వాత అత్యాధునిక డిజిటల్ పరికరాలతో పాఠ్యాంశాలను బోధిస్తారు. దృశ్యశ్రవణ మాధ్యమాలతో క్లిష్టమైన అంశాలు కూడా పిల్లలకు సులభంగా అర్థమవుతున్నాయి.

👉 బోధించిన పాఠ్యాంశాలకు వెంటవెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మేరకు వారి ప్రతిభను బేరీజు వేస్తున్నారు. పిల్లల్లో ఎవరైనా చదువులో వెనుకబడినట్టు గుర్తిస్తే.. వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కరెంట్ఎఫైర్స్పైనా పిల్లలను అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల్లో సృజన పెంపొందించేందుకు ప్రతివారం కళావేదిక పేరిట క్రీడలు, నాటికలు, చిత్రలేఖనం, కవితా రచన, నృత్యం మొదలైనవాటిని నిర్వహిస్తున్నారు. ఆరోగ్య, క్రీడా, సాంస్కృతిక, తోటపని, విద్యా విషయాల్లో విద్యార్థులతో కమిటీలు వేసి శిక్షణనిస్తున్నారు. దీంతో వారిలో స్వీయ క్రమశిక్షణ అలవడుతోంది. పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమయాల్లో మాతృవందనం కార్యక్రమం నిర్వహించి.. పై చదువులపైనా శ్రద్ధ పెడతామంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

💥 రూ. 60 లక్షలతో మూడు ప్రత్యేక గదులు 💥
👉 ప్రస్తుతం ఇందిరానగర్జెడ్పీహెచ్ఎస్ఇంగ్లిషు మీడియం స్కూల్లో 650 మంది విద్యార్థులున్నారు. గత విద్యాసంవత్సరం ఒకదశలో ఇక్కడ ప్రవేశాలను నిలిపివేశారు. విషయం తెలిసిన మంత్రి హరీశ్‌.. ప్రత్యేక చొరవ చూపారు. హైదరాబాద్కు చెందిన నాట్కో ట్రస్ట్వారి సహకారంతో రూ.60 లక్షలు వెచ్చించి మూడు అదనపు గదులు, డిజిటల్ల్యాబ్, ఒక వంటశాల, బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిరుడు జూలైలో విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న బోధన, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

💥 ఇదీ ప్రత్యేకత 💥
👉 ప్రధానోపాధ్యాయుడు రామస్వామి స్కూల్పనితీరును మెరుగుపరిచేందుకు వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. అడ్మిషన్మొదలుకొని వీడ్కోలు వరకు అన్ని ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకునే అవకాశం కల్పించారు. టీచర్లు, విద్యార్థుల హాజరును సాధారణ రిజిస్టర్లో కాకుండా కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. పిల్లల పేపర్లు దిద్ది, ఫలితాలను కంప్యూటర్లలో ఫీడ్చేస్తారు. దీంతో టీచర్లపై పనిభారం తగ్గి, విద్యార్థుల పట్ల మరింత శ్రద్ధ కనబర్చడానికి అవకాశం కలుగుతోంది.

👉 మేరకు ఇటీవల ఢిల్లీలో ఎన్సీఈఆర్టీ వారు పాఠశాలల నాయకత్వ లక్షణాల అభివృద్ధిఅనే అంశమ్మీద జాతీయ స్థాయిలో నిర్వహించిన సదస్సులో హెడ్మాస్టర్రామస్వామి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఇది హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్జావడేకర్ను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన రామస్వామినిరియల్హెచ్ఎంగా అభివర్ణించారు. పాఠశాల.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనిచేసే అటల్ఇన్నోవేషన్మిషన్నీతి ఆయోగ్అటల్టింకరింగ్ల్యాబ్కు ఎంపికైంది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS