Wednesday, 17 January 2018

వాట్సాప్‌లో ఇకపై ఫేక్ మెసేజ్‌లను పంపలేరు.. ఎందుకో తెలుసా..?




👉 నేటి తరుణంలో దాదాపుగా అన్ని సోషల్ మీడియా యాప్స్‌లో ఫేక్ న్యూస్ ఎలా వైరల్ అవుతున్నదో అందరికీ తెలిసిందే.

👉 ఈ క్రమంలోనే అలాంటి నకిలీ వార్తలు కొన్ని పలు వర్గాల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా వాట్సాప్‌లోనైతే నిత్యం ప్రతి యూజర్‌కు ఏదో ఒక ఫేక్ న్యూస్ వస్తూనే ఉంటుంది.

👉 కొన్ని లక్షల సార్లు అది ఫార్వార్డ్ అవుతూనే ఉంటుంది. అయితే ఇకపై ఇలాంటి ఫేక్ న్యూస్ వాట్సాప్‌లో కనిపించవు. ఎందుకంటే..

👉 వాట్సాప్ త్వరలో ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. ఏదైనా ఒక మెసేజ్ వాట్సాప్‌లో విపరీతంగా ఫార్వార్డ్ అవుతుంటే.. అలాంటి మెసేజ్‌ను గుర్తించి అందులో నిజం ఉందా లేదా అని నిర్దారిస్తారు. అందుకు ఓ బృందం పనిచేస్తుంది.

👉 క్రమంలో సదరు మెసేజ్ ఫేక్ అని తెలిస్తే ఇక ఆ మెసేజ్‌ను ఏ యూజర్ పంపినా లేదా ఏ యూజర్ అయినా రిసీవ్ చేసుకున్నా వారికి సదరు మెసేజ్‌ను ఫేక్ లేదా స్పామ్ మెసేజ్ అని వాట్సాప్ అలర్ట్ పంపుతుంది.

👉 దీంతో అది నకిలీ మెసేజ్ అని యూజర్లకు ఇట్టే తెలిసిపోతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను వాట్సాప్ అంతర్గతంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో త్వరలో తెలిసే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS