Saturday, 13 January 2018

ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన - ఉత్తమ నమూనా సృష్టికర్తలకు బహుమతుల ప్రదానం



👉 దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. విద్యార్థుల ఆవిష్కరణలు ప్రముఖుల మన్ననలు పొందాయి. సికింద్రాబాద్లోని సెయింట్ ప్యాట్రిక్స్కూల్లో ఈనెల 12 ప్రారంభమైన సైన్స్ఫెయిర్ఐదు రోజులు కొనసాగింది.

👉 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి నుంచి విద్యార్థులు 455 మంది విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

👉 తెలంగాణ నుంచి గ్రూప్కేటగిరిలో సికింద్రాబాద్లోని మహబూబ్కాలేజ్ హైస్కూల్కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులుఎ. శిరీష, బి. రీణాలు మొదటి బహుమతి గెలుచుకున్నారు.

👉 ఉపాధ్యాయుడు చంద్రశేఖర్సహకారంతో నో టూ స్మోగ్వే సోలార్రోప్వే ఇన్ మెథమెటిక్స్అనే నమూనా రూపొందించి ప్రశంసలు పొందారు.

👉 వ్యక్తిగత విభాగంలో కొత్తగూడేనికి చెందిన కె. రమాశ్రీ మోడల్బయోనిక్ హ్యాండ్రోబోట్ ఆర్మ్అంబ్లికల్స్టెమ్సెల్స్ఇన్బయోసైన్స్అనే నమూనాను టీచర్కె. రాధా అబ్రహం సూచనలతో రూపొందించి మొదటి బహుమతిని అందుకున్నారు.

👉 టీచర్ కేటగిరిలో మెదక్జిల్లాలోని కొల్చారం మండలం యూపీఎస్ యూ టీచర్మహ్మద్ నజీరుద్దిన్డిజిటల్మైక్రోస్కోప్నమూనాను సృష్టించి మొదటి బహుమతిని గెలుపొందారు.

👉 ఏపీ నుంచి గ్రూప్కేటగిరిలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వి. మోహన్స్వరాజ్, డి. మోహన్కృష్ణలు రూపొందించిన నమూనాకు మొదటి బహుమతి లభించింది.

👉 వ్యక్తిగత విభాగంలో చిత్తూరు జిల్లాలోని సోమల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి . యోగేశ్ఫ్లొరైడ్నివారణ టీ తాగినంత పని అనే నమూనాను రూపొందించి మొదటి బహుమతిని గెలుచుకున్నారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS