Wednesday, 17 January 2018

సివిల్స్‌లో 464వ ర్యాంకర్ తో ప్రత్యేక ఇంటర్వ్యూశిఖరప్రాయమైన సివిల్స్లో ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో ఇంటర్వ్యూ కీలకమైనది. అభ్యర్థి బహుముఖ ప్రజ్ఞాపాఠవాలను, వ్యక్తిత్వాన్ని పరీక్షించేందుకు ఇంటర్వ్యూను ఉద్దేశించారు. సివిల్స్సీనియర్అధికారులకు తోడు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు ఇంటర్వ్యూలో పాలుపంచుకుంటారు. అభ్యర్థి నేపథ్యం, హాబీలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నిస్తారు. అభ్యర్థులు చెప్పే జవాబులను బట్టి అత్యంత ప్రాధాన్యం కలిగిన సివిల్సర్వీసులకు వారు ఎంతవరకు అర్హులో నిగ్గుతేలుస్తారు. ఇంటర్వ్యూల తీరూతెన్ను తెలుసుకొనేందుకు ఉపకరిస్తాయన్న అభిప్రాయంతో సివిల్స్లో 464 ర్యాంకు సాధించిన చిరుమామిళ్ల వినయ్ కుమార్ చౌదరి ఇంటర్వ్యూను ప్రచురిస్తున్నాం.

బోర్డ్ఛైర్మన్‌: ఎస్ అండ్పిలో పనిచేస్తున్న మీరు ప్రైవేట్సెక్టార్ను ఎందుకు విడిచిపెట్టాలని అనుకుంటున్నారు? అందులోనే ఉండి కంప్యూటర్సైన్స్లో ఎక్సెల్కావచ్చు కదా?
: సివిల్స్ రాయలన్నది నిన్నమొన్న వచ్చిన ఆలోచన కాదు మేడమ్‌. కాలేజీ రోజుల నుంచి సివిల్స్పై కలలు కన్నాను. సామాజిక చైతన్యం మొదటి నుంచి ఉంది. సమాజానికి ఉపయోగపడాలని భావించాను. అదే నాకు సంతోషం కలిగిస్తుంది.

ప్ర: అసలా విధంగా చైతన్యం ఎలా పెరిగింది?
: మా అమ్మమ్మ అంగన్వాడీ టీచర్‌. పాతికేళ్ళకు పైగా ఆమె పనిచేశారు. నా తల్లిదండ్రులకు కూడా సామాజిక దృక్పథం ఉంది. అవే నన్ను ప్రభావపరిచాయి.

ప్ర: మీ కంపెనీ ఇటీవలి రోజుల్లో ఎక్కువగా వార్తల్లో ఉంది. అసలు అదేమిటి?
: మేడమ్, అదంతా క్రెడిట్రేటింగ్పై. మైక్రో ఎకనామిక్ఇండికేటర్స్లో మెరుగుదల ఉన్నప్పటికీ 2010 నుంచి అప్గ్రేడ్కావటం లేదు. అదే సమయంలో చైనాలో అభివృద్ధి రేటు తగ్గడానికి తోడు డెట్పెరుగుతున్నప్పటికీ దేశ రేటు డీగ్రేడ్కాలేదు.

ప్ర: అసలీ విషయంలో మీరేమి అనుకుంటున్నారు, దీనిపై మనం ఏమి చేయవచ్చు.
: రేటింగ్ఏజెన్సీలు కాన్స్షగా ఉండటమే కాకుండా, అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. బ్రిక్స్రేటింగ్ఏజెన్సీని మన దేశం కొత్తగా ప్రతిపాదిస్తోంది. అది సమస్యను కొంత వరకు పరిష్కరించవచ్చు.

ప్ర: తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదని భావిస్తున్నాం. అసలు విభజించకుండా సమస్య నివారణకు ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉన్నాయంటారా?
: మేడమ్‌! సమస్య యావత్తు నీళ్ళు, నిధులు, నియామకాల చుట్టూ ఉంది. సమస్య పరిష్కరించడానికి శ్రీకృష్ణ కమిషన్సూచించిన ప్రత్యామ్నాయాల్లో తెలంగాణ బోర్డు ఏర్పాటు ఒకటి. దానికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలంది. అయితే సాంఘిక అసమానత్వం పెచ్చుమీరుతున్నందున బోర్డు ఏర్పాటు సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం కాబోదని కూడా శ్రీకృష్ణ కమిషన్పేర్కొంది.

ప్ర: సమస్యను రాష్ట్ర విభజన పరిష్కరించిందని అంటారా?
: అవును మేడమ్‌. ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ పెట్టుబడుల ఆకర్షణలో పోటీపడుతున్నాయి. అలాగే ప్రాంతీయంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి రెండు రాష్ట్రాలూ కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం చెరువుల కింద సాగు పెంపునకు మిషన్కాకతీయ చేపట్టింది. అదేవిధంగా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే ప్రయత్నం కూడా చేస్తోంది. మిషన్భగీరథతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ఓడ రేవుల అభివృధ్దికి తోడు ఆక్వా హబ్గా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రాలుగా విడివడినందువల్లే గతంలో విస్మరించిన సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి.

(ఆపై ప్రశ్న అడిగే అవకాశం మొదటి మెంబర్కు మేడమ్కల్పించారు)
మొదటి మెంబర్‌: మీ ఆప్షనల్సోషియాలజీ. జండర్సమస్యలపై ఏమనుకుంటున్నారు. మనం దిశగా వెళుతున్నాం?
: సర్, హర్యానాలో మొదటి పర్యాయం ఛైల్డ్సెక్స్రేషియో 900 మార్కుని అధిగమించిది. ఇండస్ట్రీ మొదలుకుని వివిధ రంగాల్లో మహిళలు నాయకత్వ స్థానంలో ఉండటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సామాజిక పరివర్తన సమయంలోనే మహిళలపై పెచ్చుమీరుతున్న హింసను కూడా చూస్తున్నాం.

ప్ర: జండర్సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు మేరేం చేస్తున్నారు?
: జండర్సామాజీకరణ అనేది మొదట ఇంటి నుంచి ఆరంభం కావాలి సార్‌. తల ఊపడం ద్వారా సుజాతా మేడమ్నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నారని భావిస్తున్నాను. విలువల ఆధారిత విద్య, ప్రజల్లో వివేచన పెంపు, తగు మౌలిక సదుపాయాల కల్పన వంటివి జండర్సెన్సివిటీకి ఉపకరిస్తాయి సార్‌.

ప్ర: ఆర్థిక సంస్థలు, సర్వీసులు మహిళలకు అందుబాటులో ఉన్నాయని భావిస్తున్నారా?
: ఉన్నాయి సార్‌. అయితే మరింత కృషి దిశగా జరగాల్సి ఉంది. (ఉదాహరణగా తెలంగాణలో సెల్ఫ్హెల్ప్గ్రూపుల గురించి ప్రస్తావించాను) పెద్ద నోట్ల రద్దుతో మహిళలు బ్యాంకులకు రావడం మొదలైంది. జన్ధన్ఖాతాలు తెరవడంతో పొదుపుపై మహిళల్లో అవగాహన బాగా పెరిగింది.

రెండో మెంబర్‌: తెలంగాణలో చాలా సెల్ఫ్హెల్ప్గ్రూపులు ఉన్నాయి. వాటి విజయంపై వివరించగలరా?
( ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాను)

ప్ర: మీ అమ్మమ్మ అంగన్వాడీ వర్కర్ అని చెప్పారు. దానికీ, మీరు సర్వీస్వైపు మొగ్గు చూపడానికి సంబంధం ఏమిటి?
: సార్, చాలా సంబంధం ఉంది. సున్న నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు పోషకాహారం అందించడానికి ఐసిడిఎస్ప్రోగ్రామ్మొదట్లో పరిమితమై ఉండేది. ఇటీవలి కాలంలో రాజస్థాన్ప్రభుత్వం యూనిసె్ఫతో ఒప్పందానికి వచ్చింది. అంగన్వాడి పాఠశాలల్లో సృజనాత్మకంగా విద్యను పిల్లలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్కీమ్కూడా పక్కా ఫలితాలను అందించడమే కాదు, మిగిలిన రాష్ట్రాలు మోడల్ను ఆమోదించే స్థితిలో ఉన్నాయి.

మూడో మెంబర్‌: సాయిల్హెల్త్కార్డులు అంటే ఏమిటి
: మొదట నిర్వచనం చెప్పాను. పొలాల నుంచి మట్టి నమూనాలను అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్అధికారులు సేకరిస్తారు. మొత్తం దాని ప్రొఫైల్అంటే మైక్రో, మేక్రో నూట్రియంట్స్కాంపోజిషన్తెలియజేస్తారు. తద్వారా ఎరువులను గరిష్ఠంగా వినియోగించుకు నేందుకుగాను రైతులుకు నివేదిక ఉపకరిస్తుంది.

ప్ర: నివేదికలను రైతులకు ఇస్తారా? వారు అట్టిపెట్టుకుంటారా?
: అవునండీ. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రైతుల పొలాలతో జియోట్యాగింగ్ కార్యక్రమాన్ని ఆరంభించాయి. వాటిని నేరుగా రైతులు డౌన్లోడ్చేసుకోవచ్చు. ఆన్లైన్సౌలభ్యం కూడా ఉంది.

ప్ర: ఆధార్గురించి చాలా వింటున్నాం. దాని చుట్టూ అనేకానేక విషయాలు అల్లుకుని ఉన్నాయి కదా?
: డేటాబేస్సెక్యూరిటీ ఒక అంశం. ఇక్కడే ప్రైవసీ హక్కును ప్రస్తావిస్తు న్నారు. ఆధార్చట్టంలోని లొసుగులు రెండో అంశం. ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థ లేదు. జాతీయ భద్రత పరిధిలోని మినహాయింపు క్లాజుల ఆధారంగా - సెన్సిటివ్సమాచారం విషయంలో రాజీ తదితరాలు ఉన్నాయి.

ప్ర: డేటాబేస్సెక్యూరిటీ నిజంగా భద్రత సమస్యేనా? ఏదైనా హ్యాక్చేయవచ్చని భావిస్తున్నారా?
: నేను మీతో ఏకీభవిస్తున్నాను సార్‌. ఏదైనా హ్యాక్చేయవచ్చు. భద్రతకు సంబంధించి మరింత పక్కా చట్టాలు చాలా అవసరం.

ప్ర: డేటాబే్సను ఎవరు నిర్వహిస్తున్నారు, ఇన్ఫోసిసా, యుడిఎఐ
(దీనికి నేను సరైన సమాధానం చెప్పలేకపోయాను.)

నాలుగో మెంబర్‌: (క్లయిమేట్ఛేంజ్, ఇంట్రెస్ట్రేట్లు, ఎకానమీ దృష్ట్యా మనీ రియల్వాల్యూపై ప్రశ్నించారు. నా మెంటల్అలర్ట్నె్సను చెక్చేశారని అనిపించింది)
ప్ర: గ్లోబల్వార్మింగ్పై కొన్ని రిపోర్టులు వాస్తవం కాదని, కొన్ని ప్రయోజనాలను ఆశించి సృష్టించినవని అంటారు. మీరేమంటారు?
: నిజమేనండి. ఐపిసిసి క్లయిమేట్ఛేంజ్నివేదికల్లో కొన్ని పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయి. అయితే గ్లోబల్వార్మింగ్వాస్తవం. దాని ఫలితాలే నిరంతర కరవు తదితరాలు.

ప్ర: విషయంలో అమెరికా ఇటీవల తీసుకున్న చర్యలు ఏమిటి?
: అంతకు ముందు ఉన్న క్లీన్ఎనర్జీ నియంత్రణలను ఇటీవల ట్రంప్ప్రభుత్వం ఎత్తివేసింది. తద్వారా బొగ్గు తవ్వకాలకు అనుమతించింది. ఇక రిపబ్లికన్లు అదంతా సహజ ప్రక్రియ అంటారు.

ప్ర: గ్లోబల్వార్మింగ్నివారణ చర్యలను ఇండియా కొనసాగించాలని అంటారా? మనం మరింత పెద్ద పాత్ర పోషించాలని భావిస్తున్నారా?
: సర్, మనం కొనసాగించాలనే అనుకుంటున్నాను. సమస్యలో మనం భాగం కాము. అయినప్పటికీ నివారణలో పాలుపంచుకోవాలి.

ప్ర: బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినందున పర్యవసానాలు ఎలా ఉంటాయి?
: రెండేళ్ళుగా ఆర్బిఐ చాలా అకామిడేటివ్గా ఉంది. అయినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలనూ బ్యాంకులు కల్పించలేదు. నిరర్థక ఆస్తుల తలనొప్పే అందుకు కారణం అని కూడా చెప్పాలి. అయితే కొత్త చర్యలతో ప్రధానంగా మౌలిక వనరుల రంగం ఊపందుకుంటుంది. గృహ రుణాలు అందుకోగలిగే స్థాయిలో ఉంటాయి. మరోవైపు చూస్తే ఇది డిపాజిట్లపై ప్రభావం చూపుతుంది. స్మాల్సేవింగ్స్పై ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించింది. ఇది వృద్ధుల విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ప్ర: వడ్డీ రేట్ల తగ్గింపుతో ఏమి జరుగుతుంది?
: (కొద్ది నిమిషాల వ్యవధి అడిగాను) వడ్డీ రేట్ల తగ్గింపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా మనీ వాల్యూ పడిపోతుంది.

(చివర్లో మేడమ్కలుగజేసుకున్నారు)
ప్ర: ఇంతకు ముందు చెప్పిన జవాబులో మానిటరీ పాలసీ దెబ్బతిందని అన్నారు. అమెరికా మాంద్యం ఎదుర్కోవటం లేదని భావించటం లేదు కదా.
: మేడమ్ నేను మీతో ఏకీభవిస్తున్నాను. మాంద్యం నుంచి అమెరికా ఒకసారి బైటపడిన తరవాత, ప్రస్తుతం అది బాగా స్టాగ్నంట్గా మారింది. ఇప్పుడు ఫిస్కల్పాలసీ పాత్ర పెరిగింది.

ప్ర: జండర్ కోణంలో చూసినప్పుడు డిజిటలైజేషన్ప్రభావం - అంటే యువత, పురుషులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటాయి. మరి మహిళలకు ఇవి దూరం కదా?
: నేను కొద్ది సేపు ఆలోచించి జవాబు ఇచ్చాను. ప్రపంచ బ్యాంక్కూడా ఇదే విషయం చెప్పింది. డిజిటల్డివైడ్‌ - జండర్డివైడ్కు దారితీస్తుందని నివేదిక తెల్పింది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS