Monday, 11 December 2017

U- DISE FORM పూరించుటకు సాధారణ సూచనలు



🌸 U-DISE పత్రంలో పొందపరచిన వివరాలు *30 సెప్టెంబర్* వ తేదీ నాటికి సంబంధించినవిగా ఉండవలెను..
🌸 ప్రతీ CWSN పిల్లల వివరాలను సంబంధిత/ దగ్గరలోని పాఠశాలలో తప్పకుండా నమోదు చేయాలి..
🌸 తరగతి వారిగా వున్న section లను సూచించాలి..
(ఒక తరగతికి వేరువేరుగా హాజరుపట్టికలను వినియోగిస్తే వాటిని సెక్షన్లుగా భావించాలి)
🌸 SMC కి సంబంధించిన table లో SMC సభ్యుల సంఖ్య a=b+c కావాలి..
🌸వద్యాసంవత్సరం మార్చ్ నుండి ప్రారంభం అయింది కావున మార్చ్ వ్రాయాలి..
🌸 Physical facilities లో
పాఠశాల భవనం పూర్తి తరగతి గదులు కూలిపోయే స్థితిలో ఉంటే Dilapidated(6)
 గా సూచించాలి..
🌸 విద్యావాలంటీర్లను, CRT లను, fixed వేతనం తీసుకుంటున్న వారి వివరాలను contract teacher లో చూపాలి
🌸 Table C లో ఉపాధ్యాయుల వివరాలతో పాటు Contract Teachers (విద్యావాలంటీర్ల) ల పూర్తి వివరాలు కూడా వ్రాయాలి..
🌸 ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేసినా వేతనం తీసుకుంటున్న పాఠశాలలోనే చూపాలి..
🌸 ఆధార్, సెల్ నంబర్ మరియు ఈ మెయిల్ స్థానంలో *** గుర్తులున్నప్పటికీ మరల వారి నంబర్లను పూర్తిగా నమోదు చేయాలి..
🌸 Table C లో SGT లు Appointed for Subject సంబంధించి 1- All subjects గా నమోదు చేయాలి..
🌸 Table E లో పాఠశాలలో వున్న అన్ని మాధ్యమాలు మరియు సెక్షన్ లలో వున్న అందరి విద్యార్థుల సంఖ్యను నమోదు చేయాలి
🌸  పిల్లల వయస్సు 31-08-2017 నాటికి లెక్కించాలి. 31-08-2017 నాటికి పూర్తయిన సంవత్సరాలనే వయస్సుగా నమోదు చేయాలి..
ఉదా: విద్యార్థి వయస్సు  31-08-2017 నాటికి 9 సంవత్సరాల 11 నెలలు అయితే 9 సంవత్సరాలు గానే పరిగణలోనికి తీసుకోవాలి.
👉U-DISE లో ఓబీసీ లో అందరు BC మరియు MINORITY వారి వివరాలు కలిపి నమోదు చేయాలి
👉 దీని క్రింద టేబుల్ లో Minority వారి వివరాలు వేరుగా నమోదు చేయాలి..
🌸 Table E లో తరగతి వారిగా నమోదుచేసిన విద్యార్థుల వివరాలనుTable G లో ఆయా మాధ్యమాలుగా విభజించి రాయాలి..
ఇది రాసేటప్పుడు A లోని 27లో రాసిన బోధనా మాధ్యమాల వరుస క్రమాన్నే G table లో పాటించాలి..

👇👇 శాలసిద్ది 👇👇

U-DISE లో శాలసిద్ధికి సంబందించిన వివరాలు నమోదుచేయాలి...

👉 దీనిలో పాఠశాలలోని అన్ని మాధ్యమాలలో వున్న మొత్తం విద్యార్థుల వివరాలను సామాజిక వర్గాలవారిగా నమోదు చేయాలి..
👉 ఇక్కడ OBC లో Minority వారిని కలిపి చూపకూడదు వారికి సంబందించిన box లో వేరుగా నమోదు చేయాలి..

👉 వద్యార్థుల హాజరుశాతాన్ని తరగతుల వారిగా బాలబాలికలకు వేరుగా సూచించాలి...
ఉదా: తరగతిలో 5 మంది బాలురు ఉంటే వారి శాతాన్ని క్రిందివిధంగా లెక్కించాలి..

విద్యార్థుల మొత్తం హాజరు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ × 100
    పనిదినాలు
👉 ఉన్నత పాఠశాలలలోని విద్యార్థుల ఫలితాలను సంబంధిత విషయాలవారిగా A, B, C, D మరియు E గ్రేడ్ లలో వున్న వారి శాతాన్ని నమోదు చేయాలి..
Note: (Subjects with consistent low performance) లో
 A, B, C, D మరియు E గ్రేడ్ లలో ఏది తక్కువ శాతం ఉంటే దానిని వ్రాయాలి..
👉 పాఠశాలలో పనిచేస్తున్న అందరు అనగా ఉపాధ్యాయులు మరియు విద్యావాలంటీర్ల వివరాలను అందరివి శిక్షణ పొందిన వారిని, పొందనివారిని నమోదు చేయాలి...
👉 Domain లలోని levels లను శాలసిద్ది మాడ్యులే చదివి నమోదు చేయాలి...

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS