Sunday, 3 December 2017

ఉపాధ్యాయులుగా మనం కొన్ని అలవాట్లు మానుకుంటే మంచిది💥 💥 ఉపాధ్యాయులుగా మనం కొన్ని అలవాట్లు (ఉంటే) మానుకుంటే మంచిది. ఎందుకంటే సమాజం కన్ను మన మీద ఉన్నంతగా ఇతరుల మీద ఉండదు!
💥 💥 ప్రమాదాన్ని కొనితేగల కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఇవి :-

💥 1. బడికి ఆలస్యంగా రావడం, ముందుగా వెళ్ళి పోవడం
💥 2. బడిలో ధూమపానం చేయడం
💥 3. డ్రింక్ చేసి స్కూలుకు రావడం
💥 4. టీ షార్ట్స్ జీన్ ప్యాంట్స్, ఇతర అసాధారణ దుస్తులు వేసుకోవడం.
💥 5. అమ్మాయిల్ని రావే,పోవే అనడం. అమ్మాయిలను తాకడం. వాళ్ళ ముందు అసభ్య పదజాలం ఉపయోగించడం, అసభ్యంగా ప్రవర్తించడం
💥 6. కులాలు, మతాలు సాంప్రదాయాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.
💥 7. తరగతి గదిలో ఫోను ఉపయోగించడం, ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం
💥 8. పిల్లల్ని కాపీకి ప్రోత్సహించడం, జవాబు పత్రాలు సరిగా చూడకుండానే మార్కులు వేయడం, దిద్దకుండా మార్కులు వేయడం
💥 9. పిల్లలతో ఫని చేయించడం (ఉదా: బయటి నుంచి సరుకులు, బియ్యం బస్తాలు, నీళ్ళు తెప్పించడం) బడికి సంబంధించిన పనులైతే మనం పాల్గొనకుండా కేవలం వాళ్ళతోనే చేయించడం.
💥 10. పిల్లలకు నోటు పుస్తకాలు వగైరా అమ్మడం (లాభాపేక్షతో)
💥 11. పిల్లల్ని కూరగాయలు వగైరా తెమ్మని పురమాయించడం
💥 12. మహిళా, పురుష ఉపాధ్యాయులు అతి చనువుగా వ్యవహరించడం, పరాచికాలాడడం
💥 13. పిల్లల ముందు పోట్లాడుకోవడం, గట్టిగా వాదులాడుకోవడం.
💥 14. విద్యార్థుల పట్ల పక్షపాత ధోరణి కనబర్చడం.
💥 15. క్లాసులకి ఆలస్యంగా వెళ్ళడం, పూర్తి కాకముందే బయటకు రావడం, అసలు వెళ్ళక పోవడం
💥 16. విద్యార్థులనువిచక్షణారహితంగా దండించడం. చెడు పదజాలంతో దూషించడం.
💥 17. మధ్యాహ్న భోజనం వాళ్ళచే వేరే కూరలు చేయించు కోవడం, మధ్యాహ్న భోజనం తినడం, పాఠశాలలో పార్టీలు చేసుకోవడం.

👉 ఆత్మ విమర్శ చేసుకొని ఇందులో మనకేమైనా వర్తించేవి ఉంటే ఆవి మానుకుంటే అందరికీ క్షేమదాయకం.
👉 కొస మెరుపు: ఎవ్వరూ చూడడం లేదు కదా అనుకోకండి. అన్నీ గమనించే వాళ్ళు పిల్లలు. మన పిల్లలే కదా అనుకోకండి. వాళ్ళు కూడా సమాజంలో భాగమే.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS