Monday, 18 December 2017

అర్హులైతే వారినీ టీఆర్‌టీ పరీక్షకు అనుమతించండి



 💥 తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం 💥
👉 హిందీ విద్వాన్, భూషణ్ల్లో పట్టభద్రులైన అభ్యర్థులు సాధారణ హిందీ డిగ్రీ చేసిన వాళ్లతో సమానమనే నిర్ణయానికొస్తే వారిని ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు అనుమతించాలని, వారి దరఖాస్తులను స్వీకరించాలని తెలంగాణ సర్కారును హైకోర్టు ఆదేశించింది.  
👉 వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం సోమవారం (డిసెంబరు 18) మేరకు ఆదేశాలు జారీచేసింది.
👉 టీఆర్టీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించకపోవడంపై మహబూబనగర్ జిల్లాకు చెందిన కనకప్ప మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్టీకి సంబంధించిన నిబంధనల జీవోపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
👉 సోమవారం వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం.. సాధారణ డిగ్రీలతో పిటీషనర్ల డిగ్రీ సమానమా? కాదా? అనే అంశంపై వారంలో నిర్ణయం తీసుకొని వారిని పరీక్షకు అనుమతించడంపై అభిప్రాయానికి రావాలని సర్కారును ఆదేశించింది.
👉 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం పిటీషనర్లకు తెలియజేయాలని స్పష్టంచేసింది.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS