Saturday, 16 December 2017

బీఈడీలో గణితం అభ్యసించాల్సిందే!



💥 💥  బీటెక్‌, బీఈడీ చేస్తే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అర్హులు కాదు: హైకోర్టు
👉 ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) ద్వారా స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం) పోస్టుల భర్తీకి బీటెక్‌, బీఈడీ పట్టభద్రులై ఉంటే సరిపోదని హైకోర్టు తేల్చిచెప్పింది. బీఈడీలో గణితం అభ్యసించి ఉండాలని స్పష్టంచేసింది.
👉 ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
👉 స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి గణితంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేయాలని, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గుర్తించిన విద్యాసంస్థ నుంచి బీఈడీలో గణితం అభ్యసించి ఉండాలని పేర్కొంటూ.. టీఆర్‌టీ ప్రకటన నిబంధనలు పేర్కొనడాన్ని సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన సంజీవరావు హైకోర్టును ఆశ్రయించారు.
👉 బీటెక్‌, బీఈడీ చేసిన తాను సమర్పించే దరఖాస్తును అంగీకరించేలా అధికారుల్ని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం) పోస్టుకు దరఖాస్తు చేసే వారు బీఈడీలో గణితం అభ్యసించి ఉండాలని పేర్కొంది. వ్యాజ్యాన్ని కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు దరఖాస్తును తిరస్కరించడాన్ని తప్పుపట్టలేమని పేర్కొంది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS