Thursday, 21 December 2017

కస్తూర్బాల్లో ఒప్పంద ఉద్యోగుల కొనసాగింపుపై హైకోర్టు తీర్పు



💥 అర్హత ఉంటే క్రమబద్ధీకరించండి 💥

👉 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ) ల్లో 2005లో నియమితులైన ఒప్పంద ఉద్యోగులకు పనిచేయగలిగిన సామర్థ్యం ఉంటే క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.
👉 క్రమబద్ధీకరణలో 2012 -13 నాటి మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టంచేసింది. తగిన సామర్థ్యం లేకుంటే చర్య తీసుకునే పక్షంలో నోటీసులు ఇవ్వాలని పేర్కొంది.
👉 కస్తూర్బాల్లో 2005లో ఒప్పంద విధానంలో నియమితులైన తమను తొలగించి కొత్తవారిని తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు బుధవారం (డిసెంబ‌రు 20) ఈ మేరకు తీర్పు వెలువరించారు.
👉 కేజీబీవీల్లో, బాలికలు తిరిగే నిషేధిత ప్రాంతాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నివసించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను 2012 - 13 మార్గదర్శకాల ప్రకారం, అర్హతల ఆధారంగా మహిళలతో భర్తీ చేయవచ్చని ప్రభుత్వాలకు సూచించారు.


💥 ఇదీ కేసు 💥
👉 2005లో నాటి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కస్తూర్బాల్లో  క్లర్క్‌లు, అకౌంటెంట్‌ పోస్టులను ఒప్పంద పద్ధతిలో నియమించి.. సర్వీసును పొడిగిస్తూ వస్తున్నారు. తగిన అర్హతలు (కామర్స్‌ డిగ్రీ) లేనివారిని నియమించడంతో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ప్రభుత్వం గుర్తించింది.  
👉 లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో కస్తూర్బాల్లో పురుషులను నియమించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
👉 ఈ నేపథ్యంలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఏకరూప  విధానం తీసుకువచ్చింది. దీని ప్రకారం 2013 - 14 విద్యా సంవత్సరానికి అర్హులైన మహిళా అభ్యర్థులను నియమించాలని మార్గదర్శకాలు జారీచేసింది. అదేసమయంలో తగిన అర్హతలు లేనివారిని తొలగించే ప్రయత్నం చేయగా పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS