Wednesday, 6 December 2017

ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు నూతన నిబంధనలు



👉 పరిశోధనలు ఎక్కడ బాగా సాగుతాయో అక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. అందుకే వర్సిటీలు పరిశోధనలను ప్రోత్సహిస్తాయి. పరిశోధనలు అధికంగా నిర్వహిస్తే అందుకు తగిన విధంగా ఆర్థిక సహకారాన్ని పుష్కలంగా అందిపుచ్చుకోవచ్చు. అందుకు తగినట్లునాగే ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన ప్రక్రియ సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో పీహెచ్‌డీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం చేసిన అధికారులు ఈ విద్యాసంవత్సరం మాత్రం సరైన సమయంలో ప్రకటన జారీ చేశారు. ఇంతకుముందు 2009, 2014లో ప్రవేశాలకు ప్రకటన జారీ చేశారు.
👉 2014 ప్రకటన ప్రవేశాలను 2017లో పూర్తి చేశారు
యూజీసీ మార్పులకు అనుగుణంగా..: ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాల నిబంధలపై విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో నూతన నిబంధనలు తీసుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యూజీసీలో అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా పీహెచ్‌డీ ప్రవేశాల నిబంధనలల్లో కీలక మార్పులు చేసినట్లు ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. డీన్‌లు, సీనియర్‌ అధ్యాపకులతో పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసి నూతన నిబంధలను తయారు చేశామని పేర్కొన్నారు. నూతన నిబంధనలతో విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, ఈ సంవత్సరం పీహెచ్‌డీ ప్రవేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని వివరించారు.

💥 💥 పోటీ తీవ్రం.. 💥 💥
👉 ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో పోటీ ఉంది. మూడేళ్ల నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహించక పోవడంతో ఈ సారి పోటీ తీవ్రంగా ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు.
👉 2014 విద్యా సంవత్సరం ప్రవేశాలను ఈ సంవత్సరం పూర్తి చేయడంతో ప్రస్తుత ప్రకటనకు అనుకున్న స్థాయిలో ఖాళీలు ఉండకపోవచ్చని సమాచారం. దీనికితోడు యూనివర్సిటీలో చాలామంది సీనియర్‌ అధ్యాపకులు పదవీవిరమణ చేయడంతో సీట్లు తగ్గే అవకాశాలున్నాయి.

💥 గతంలో పీజీ కోర్సులకు 10 మార్కులు, యూజీ కోర్సులకు 5 మార్కుల వెయిటేజీ కేటాయించారు. వాటిని కూడా అయిదు విభాగాలు చేసి కేటాయించారు. కానీ నూతన నిబంధనల ప్రకారం మూడు విభాగాలు మాత్రమే చేశారు. యూజీకి వెయిటేజీ మార్కులను పూర్తిగా రద్దు చేశారు.

💥 యూజీసీ-నెట్‌, ఐఎస్‌ఐఆర్‌-నెట్‌ అర్హత కలిగి గతంలో 20 మార్కులు ఉన్నాయి. ప్రస్తుతం దానిని 25 మార్కులకు పెంచారు. గతంలో ఎంపీల్‌ చేసిన విద్యార్థులకు సెట్‌ అర్హత గలవారి కంటే ఎక్కువ మార్కులు కేటాయించారు. ప్రస్తుతం ఎంపీల్‌ కంటే సెట్‌లో అర్హత సాధించన విద్యార్థులు అధిక మార్కులు ఇస్తున్నారు.

👉 గతంలో యూజీసీ నెట్‌ విద్యార్థులకు, ఓయూ అర్హత ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చిన విద్యార్థులకు మార్కుల కేటాయింపులో 10 తేడా ఉండేది. ప్రస్తుతం దానిని అయిదు మార్కులకు తగ్గించారు. పరిశోధన అనుభవం, నమునా, ముఖాముఖి విభాగాలకు ఎలాంటి మార్పులు లేకుండా మార్కులు కేటాయించారు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS