Sunday, 24 December 2017

పెన్షనర్ మరణించినపుడు కుటుంబ సభ్యులు ఏమి చేయాలి🔥 🔥 సందేహంసమాధానం 🔥 🔥

📚ప్రశ్న:

📚పెన్షనర్ మరణించినపుడు కుటుంబ సభ్యులు ఏమి చేయాలి?

📕జవాబు:

📕పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి. తెలియ పరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్ (ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ఐరిష్)ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఎటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు. రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.

📚ప్రశ్న:

📚PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా?

👉జవాబు:

👉వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప,సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.

👉ప్రశ్న:

👉స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు?

👉జవాబు:

👉ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన. తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.

👉ప్రశ్న:

👉వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు?

👉జవాబు:

👉వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.


👉ప్రశ్న:

👉ఐటీ రిటర్న్ అందరూ సమర్పించాలా?

👉జవాబు:

👉2,50,000రూ ఆదాయం దాటిన వారందరూ ఆగస్టు 31లోగా రిటర్న్ దాఖలు చెయ్యాలి. వేతన ఆదాయం మాత్రమే ఉన్నవారు ITR--1 ఫారంలో ఈ--ఫైలింగ్ చేయవచ్చు_

👉ప్రశ్న:

నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉంది.కానీ మెడికల్ లీవు పెట్టాను.నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా? చెయ్యరా?

👉జవాబు:

👉జీఓ.192 తేదీ:1.7.74 ప్రకారం మీరు ML లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వటం కుదరదు.మీరు ఎపుడు జాయిన్ ఐతే అప్పుడు నుండి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వటం జరుగుతుంది.అప్పటి వరకు పాత జీతమే వస్తుంది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS