Sunday, 24 December 2017

కొత్త పీఆర్సీ పై ఉద్యోగుల్లో ఆశలు - గ్రాట్యుటీ విషయంలో చర్చించాలని ఉద్యోగ సంఘాల వినతి



🔥 🔥 అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వ పెద్దలు 🔥 🔥
🔥 🔥 గ్రాట్యుటీ విషయంలో చర్చించాలని ఉద్యోగ సంఘాల వినతి 🔥 🔥
👉 రాష్ట్రంలో మొట్టమొదటి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నియామకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులుసహా ప్రభుత్వోద్యోగులు ఆశలు పెంచుకుంటున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
👉 రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా అన్ని అంశాలను సునిశితంగా అధ్యయనం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్, గ్రామీణప్రాంతాల్లో ఒకే క్యాడర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి వేతనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.
💥 ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వివిధ శాఖల్లో 60 నుంచి 70 రకాల క్యాటగిరీలు వచ్చాయి. ఒకే క్యాటగిరీకి వేర్వేరుశాఖల్లో వేర్వేరు వేతనాలు ఉన్నాయి. కొన్నిశాఖల్లోని ఒకే క్యాటగిరీలను అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ అంటూ వేర్వేరు పేర్లతో వ్యవహరిస్తున్నారు. విద్యార్హతలు, క్యాటగిరీలలో తేడాలు లేనప్పటికీ, వేతన స్థిరీకరణల్లో వ్యత్యాసాలు ఉండటాన్ని ఉద్యోగ సంఘాలు చర్చనీయాంశం చేస్తున్నాయి.
💥 2015 పీఆర్సీ సందర్భంగా ఇచ్చిన సిఫారసులను పరిశీలించాలని విన్నవిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీని రూ.20 లక్షల వరకు పెంచింది. ఈ విధానంలోనే గ్రాట్యుటీ విషయంలో చర్చ జరుగాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
💥 రిటైరైన ఉద్యోగులకు పెంచాల్సిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో కూడా నిర్ణయాలు వెలువడలేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మార్కెటింగ్‌శాఖలో రిటైరైన ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం హెల్త్‌కార్డులు ఇవ్వాలని ఆ సంఘం ఉపాధ్యక్షుడు చామల సుధాకర్‌రెడ్డి కొంతకాలంగా విజ్ఞప్తిచేస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై చర్చ జరుగాలని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
💥 జూనియర్ అసిస్టెంట్ క్యాటగిరీకి డిగ్రీ కనీస విద్యార్హత నిర్ణయించినందున వేతన స్థిరీకరణలో కూడా మార్పులు ఉండాలని కోరుతున్నారు. కొత్త ఉద్యోగులు, సీనియర్ ఉద్యోగులు గ్రామీణప్రాంతాల్లో ఉత్సాహంగా పనిచేసేలా మార్పులు ఉండాలనే సూచినలు వస్తున్నాయి. 2015 నుంచి చూసినా ధరల సూచీలో చాలా మార్పులు ఉన్నాయని, మరోవైపు జీఎస్టీ ప్రభావాలు ఉన్నాయని ఉద్యోగసంఘాలు వాదిస్తున్నాయి.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS