Sunday, 3 December 2017

ప్రభుత్వోద్యోగుల భీమా పాలసీ



💥 "APGLI" గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం

💥 LIC, PLI ల కంటే APGLI మంచిదని చాలా మందికి తెలియదు. LIC, PLI ల గురించి ఏజెంట్లు వివరిస్తారు కాబట్టి వాటి గురించి కొంత అవగాహన ఉంటుంది.

💥 కానీ APGLI గురించి మనకు ఎవరూ చెప్పరు,
💥 ఏదో APGLI  మంచిది అంటారు కాని దాని గురించిన పూర్తి సమాచారం తెలియదు మనకి.
💥 ఇప్పడు నేను APGLI గురించి నాకు తెలిసింది మీకు వివరిస్తాను.

💥 ఉదాహరణకు మనం 2009 లో బర్తీ అయినప్పుడు మన APGLI చందా 350/- ఉండేది, దానికి అందరికీ 'A' బాండ్ వచ్చింది, 2015 PRC తో జీతం పెరగ్గానే ఇంకో 300/- పెరిగి చందా 650/- అయ్యింది.

💥 పెరిగిన 300/- ల కి 'B' బాండ్ వచ్చింది. కొందరికి ఇంకా రాలేదు. ఇంకొందరు అయితే బాండ్ కోసం దరఖాస్తు కూడా పెట్టి ఉండరు, దరఖాస్తు పెట్టాలనే విషయం కూడా కొందరికి తెలియదు.

💥 కొందరు APGLI గురించి అవగాహన ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చందాను పెంచుకున్నారు.

💥 దానికి పెరిగిన మొత్తానికి మళ్ళీ బాండ్ లు వస్తాయి.  ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను.
💥 ఎప్పుడైతే మనం APGLI అమౌంట్ ని పెంచుకుంటామో... అది జీతంలో కట్ అయి పే స్లిప్ రాగానే వెంటనే ప్రపోసల్ ఫామ్ తీసుకుని దరఖాస్తు చేయాలి.

💥 అది ఎందుకో ఒక ఉదాహరణ చెప్తాను.
💥 మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్ ఒకతను... అందరూ APGLI మంచిది అని చెప్తే తన చందా 350/- కి 2650/- కలిపి 3000/- చేశాడు.

💥 కానీ బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేయాలనే విషయం అతనికి తెలియదు, ఎవరూ చెప్పలేదు. అలా రెండున్నర సం"లు గడిచిపోయాయి, దురదృష్టం వల్ల అతను ప్రమాదంలో మరణించాడు.

💥 మరణానంతరం అతనికి రావాల్సిన అన్ని బెనిపిట్స్ తో పాటు APGLI బెనిపిట్స్ కూడా వచ్చాయి, కానీ 300 రూ"ల ఒక 'A' బాండ్ బెనిపిట్స్ మరియు మాత్రమే వచ్చాయి, 2650 రూ"ల బెనిపిట్స్ రాలేదు.

💥 ఎందుకంటే అతను 'B' బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు కాబట్టి. నెల నెలా 2650రూ"లు అతని జీతం నుండి కట్ అయి అతని APGLI ఖాతాలో కలిసాయి.

💥 కానీ 'B' బాండ్ కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల 2650 రూ"ల 'B' బాండ్ బెనిపిట్స్ రాలేదు, నెల నెలా కట్ అయిన 2650 రూ"ల రెండున్నర సం"ల మొత్తాన్ని వాపసు చేశారు.

💥 అతను 'B' బాండ్ కి దరఖాస్తుకు చేయకపోవడం వల్ల అతని కుటుంబం ఎన్ని లక్షల డబ్బులను కోల్పోయిందో నేను మీకు తర్వాత వివరిస్తాను.

💥 APGLI పాలసీలో.... ఉద్యోగి యొక్క వయస్సుని బట్టి అతను కట్టే ప్రీమియంకు రేటు నిర్ణయిస్తుంది ప్రభుత్వం.

💥 అంటే... 21 సం"ల వయస్సు నుండి 53 సం"ల వయస్సు వరకు(53 సం"ల వయస్సు తర్వాత APGLI చేయరాదు)ఈ వయస్సుకు ఇన్ని రూ"లు అని మనం కట్టే ప్రీమియం రూ"లను బట్టి మనకు బాండ్ వాల్యూ నిర్ణయించబడుతుంది.

💥 కింద చెప్పేది జాగ్రత్తగా చదివి అర్థం చేస్కోండి. ఇప్పడు నా వయస్సు ఉదా: 29 సం"లు. నేను 4000 రూ"ల ప్రీమియం కడితే నేను కట్టిన ఒక్కోరూపాయికి ప్రభుత్వం 329 రూపాయల 50 పైసలు ఇస్తుంది.

 💥 అంటే 4000x329.50=13,18,000 రూ"లు. అక్షరాల 13 లక్షల 18 వేల రూ"లు నా బాండ్ వాల్యూ. 29 సం"ల వయసున్న నాకు ఇంకా 29 సం"ల సర్వీసు ఉంది, ఈ సర్వీసు కాలం 29 సం"లకు నా బాండ్ వాల్యూ 1318000 రూ"లకు సంవత్సరానికి 10% బోనస్ ఇస్తుంది. అంటే 1318000X290%=3822200/- అక్షరాల 38 లక్షల 22 వేల 200 రూ"లు నా పదవీ విరమణ సమయంలో బోనస్ గా వస్తుంది.

💥 మరియు బాండ్ వాల్యూ+బోనస్ కలిపి అంటే 1318000+3822200=5140200/- అక్షరాలా 51 లక్షల 40 వేల 200 రూ"ల వరకు (కొంచం అటూ ఇటూ గా) నేను నా పదవీ విరమణ సమయంలో తీసుకుంటాను.

 💧 ఇది మీరు నమ్మగలరా....?

💥 నేను కట్టే నెల నెలా 4000 లు 29 సం"లకి 13,92,000 మాత్రమే... కానీ నేను నా 58 సం"ల వయస్సలో అరకోటి పైగా తీస్కుంటాను.

💥 LIC కాదు, PLI కాదు ఏ భీమా కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తం ఇవ్వదు ఒక APGLI మాత్రమే ఇస్తుందని ఘంటాపథంగా చెప్పగలను.

💥 ఇది నిజం ఎందుకంటే... వేరే భీమా కంపెనీలు వాళ్ళ వేల మంది ఉద్యోగులకు జీతాలివ్వాలి, ఏజెంట్లకు కమీషన్ లు ఇవ్వాలి, అవన్నీ ఎక్కడి నుండి ఇస్తాయి మనం కట్టే డబ్బుల నుండే కదా.... మళ్ళీ లాభాలు రావాలి.

💥 APGLI ప్రభుత్వాదినిది, దీంట్లో వచ్చే లాభాలు ఎవరూ పంచుకోరు, ప్రభుత్వం దీని నుండి రాబడి ఆశించదు. అందువల్ల మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది.

💥 మరణించిన మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్ అతని 25 సం"ల వయస్సులో 2650/- కి అతని చందా పెంచి, 'B' బాండ్ కి దరఖాస్తు చేయక, 28 సం"ల వయస్సులో అతను మరణించడం వల్ల  అతని కుటుంబం కోల్పోయిన మొత్తం రెండున్నర సం"ల బోనస్ తో కలిపి ఎంతో తెలుసా....?
💥 అక్షరాలా 12 లక్షల 38 వేల 610 రూ"లు. ఇది ఎవరూ ఆర్చలేని, తీర్చలేని నష్టం.

💥 అతను తెలియక చేసిన తప్పును మనం ఎవరమూ చేయకూడదు.
💥 ఇప్పుడు నేను, వయస్సుల వారిగా.... మనం కట్టే రూపాయికి ప్రభుత్వం ఇచ్చే వెలను కింద ఇస్తాను. మీరు బాగా అలోచించి APGLI చందాను మీ సామర్థ్యాన్ని బట్టి ఎంత పెంచాలో నిర్ణయించుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళండి.

Age     -     Rate

25        -     389.50
26        -     374.10
27        -     359 
28        -     344.10
29        -     329.50
30        -     315.10
31        -     301
32        -     287.20
33        -     273.60
34        -     260.30
35        -     247.3.        

💥 ® వయస్సు పెరిగినా కొద్దీ.... ప్రభుత్వం ఇచ్చే వెల తగ్గుతూ వచ్చింది కదా... ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషికి రిస్క్ పెరుగుతుంది.

💥 అందుకని ఏ జీవిత భీమా కంపెనీ అయినా వయస్సును బట్టి పాలసీని నిర్ణయిస్తాయి.

💥 తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి లేదంటే యవ్వనంలో చేసిన APGLI బీమా పాలసీలైనా ఉండాలి అని.
💥 చిన్న వయస్సులోనే పాలసీ చేస్తే చాలా ఎక్కువ భీమా అమౌంట్ మనకు వస్తుంది. అందుకని ఆలస్యం చేయకండి.

💥 సమయం లేదు మిత్రులారా.... పెంచని వాళ్ళు పెంచండి, పెంచిన వాళ్ళు బాండ్ లకి దరఖాస్తు చేయండి.

💥 ఈ సమాచారాన్ని అన్ని బ్యాచ్ ల తమ్ముళ్ళకి తెలియజేసి వాళ్ళతో APGLI అమౌంట్ పెంచుకోమని చెప్పండి. అలాగే సీనియర్స్ కి కూడా తెలియజేయండి.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS