Friday, 22 December 2017

ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శన వేదిక



💥 💥 ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 💥 💥
👉 విద్యార్థుల సృజనాత్మక ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శన వేదికగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.
👉 వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను డిసెంబ‌ర్ 21 ఆయన ప్రారంభించారు.
👉 వర్ధన్నపేట శాసనసభ్యుడు అరూరి రమేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 31 జిల్లాల నుంచి వచ్చిన 850 మంది విద్యార్థులు...456 గణిత, పర్యావరణ సైన్సు ఎగ్జిబిట్లను ప్రదర్శనలో ఉంచారన్నారు.
👉 ఉత్తమంగా నిలిచిన వాటిని జనవరి 8 హైదరాబాద్‌లో నిర్వహించే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేస్తామన్నారు. ఈ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి ఎక్కువ ఎగ్జిబిట్లు ఎంపికయ్యేలా చూడాలన్నారు. 
👉 విద్యార్థుల్లో ప్రేరణ కలిగించి విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి చూపేలా బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల విద్య డైరెక్టర్‌ కిషన్‌, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS