Thursday, 21 December 2017

గురుకుల పీజీటీ భాషల ఫలితాల వెల్లడి



💥 నియామకానికి 363 మంది అభ్యర్థుల ఎంపిక 💥
💥 మరో 45 పోస్టులకు అభ్యర్థులు లేరు 💥
👉 గురుకులాల్లో వివిధ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షల ఫలితాల వెల్లడి ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ భాషల పోస్టుల ఫలితాలను ప్రకటించారు. ఆయా పోస్టుల భర్తీకి రాతపరీక్షలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించగా... 363 మంది అభ్యర్థులు నియామకానికి అర్హత సాధించారని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. మరో 45 పోస్టుల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా మిగిలిపోయాయి.
👉 వీటిలో అంధత్వ లోపం కలిగిన అభ్యర్థుల కోటాలో 17 పోస్టులు, ఉర్దూ కేటగిరీలో 28 పోస్టులు భర్తీ కాలేదు.
👉 పీజీటీ భాషల పోస్టులకు ప్రధాన పరీక్షలు ఆగస్టు 27, 28 తేదీల్లో జరిగాయి. ఆయా పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1 : 2 నిష్పత్తిలో ఎంపిక చేసి.. సెప్టెంబరు 26, అక్టోబరు 9, 10, 11... డిసెంబరు 8 తేదీల్లో ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అర్హతల ప్రకారం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
 
💥 టీజీటీలో తదుపరి మెరిట్‌ అభ్యర్థులకు అవకాశమివ్వండి... 💥
👉 పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు... ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరైతే టీజీటీ పోస్టుల ప్రాధాన్యత నుంచి తప్పుకోవాలని కమిషన్‌ కోరింది. తద్వారా టీజీటీ పోస్టులకు వారి స్థానంలో తదుపరి మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అవకాశముంటుందని తెలిపింది.
👉 మరిన్ని వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పీజీటీ పోస్టుల నియామకానికి ఎంపికైన అభ్యర్థులకు సూచించింది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS