Sunday, 24 December 2017

ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా



🔥🔥 సందేహంసమాధానం 🔥🔥

💥 ప్రశ్నా💥
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా?*
🅰️జవాబు:
*చేయవచ్చు APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు.అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A,జాయినింగ్ కొరకు    ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.*

💥ప్రశ్న💥
*కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తి సెలవు రోజు జాయిన్ అవ్వవచ్చా??*
🅰️జవాబు:
*ఖచ్చితంగా వర్కింగ్ డే నాడే చేరాలి.*

💥ప్రశ్న💥
*ఒక టీచర్ జులై నుంచి డిసెంబర్ వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్ కలదు.ఇస్తారా??*
🅰️జవాబు:
*ఇంక్రిమెంట్ తేదీ నుంచి సెలవు లో ఉన్నప్పుడు సెలవు అనంతరం విధులలో చేరిన తేదీ నుంచి మాత్రమే ఆర్ధిక లాభం వచ్చేవిధంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది.*

💥ప్రశ్న💥
*అర్ధ జీతపు సెలవు ఎన్ కాష్ మెంట్ ఎలా??*
🅰️జవాబు:
*జీఓ.148 తేదీ:21.8.2017 న ఆర్ధిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం రిటైర్మెంట్ అనంతరం ఎరెoడ్ లీవ్ మరియు అర్ధ జీతపు సెలవు కలిపి 300 రోజులకి ఎన్ క్యాష్  చేసుకోవచ్చు.*

💥ప్రశ్న💥
*ఇపుడు కారుణ్య నియామకాలకు అర్హత ఏమిటీ??*
🅰️జవాబు:
*జీఓ.112 తేదీ:18.8.2017 ప్రకారం జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు స్థాయి పోస్టులకు కారుణ్య నియామకం లకి ఇంటర్మీడియట్ కనీస అర్హత.2015 లో రాష్ట్ర ప్రభుత్వం కనీస అర్హతగా డిగ్రీ చేసింది. దీన్ని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ గా మార్పు చేసింది. ఐతే ఇలా నియామకం పొందిన వారు 5 ఇయర్స్ లోగా డిగ్రీ అర్హత సంపాదించాలి.*

💥ప్రశ్న💥
*ఆన్ డ్యూటీ తర్వాత రోజు CL పెట్టవచ్చా??*
🅰️జవాబు:
*కొన్ని సందర్భంలలో OD పై వెళ్ళినప్పుడు TA చెల్లిస్తారు. అదే మీరు తర్వాత రోజు CL పెడితే TA చెల్లించరు.TA వద్దనుకుంటే CL పెట్టుకోవచ్చు.*

💥ప్రశ్న💥
*ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి??*
🅰️జవాబు:
*బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతి కి అవకాశం కల్పించారు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ,జిఓ టెస్టులు పాస్ కావాలి.45 ఇయర్స్ వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి,50 ఇయర్స్ వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.*

💥💥ప్రశ్న జవాబులు 💥💥

1) NPS/CPS *ఉద్యోగులకు 50వేల అదనపు పన్నురాయితీ వర్తిస్తుందా?*
A) వర్తిస్తున్నది అయితే దీనిని మ్యానువల్ రిటర్న్ లలో అనుమతించనప్పటికి ప్రస్తుతం e ఫైలింగ్ లో అనుమతించ బడుతున్నది.

2) *e ఫైలింగ్ ఎపుడు చేయవచ్చు*
 మన DDO లు సంబందిత ఫైనాన్షియల్ ఇయర్ TDS చేసివుంటే మన e ఫైలింగ్ చేయవచ్చు.
3) *నేను ఇది వరకే టాక్స్ చెల్లించా నాకు కట్టిన టాక్స్ రిటర్న్ వస్తుందా*

ఖచ్చితంగా 
మీరు అదనంగా కట్టిన టాక్స్ మీ బ్యాంక్ ఖాతాకు జమచేయబడుతుంది.

3) *నేను ఒక cps ఉద్యోగిని ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్  క్లైం చేసుకోవచ్చు*

మీ సేవింగ్స్ 80CC ప్రకారం *1.5*లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది(eఫైలింగ్ చేస్తే).లేదంటే వర్తించదు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS