Wednesday, 13 December 2017

ప్రపంచ తెలుగు మహాసభల షెడ్యూల్ ఇదే..



👉 శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ తెలుగు మహాసభల కరదీపికను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఏయే తేదీలలో ఏయే వేదికల మీద ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇందులో పేర్కొన్నారు. ఆ వివరాలివే.

👉 పాల్కురికి సోమనాథ ప్రాంగణం (ఎల్బీ స్టేడియం)
👉 బమ్మెర పోతన వేదిక
డిసెంబర్ 15: ప్రారంభ వేడుక సమయం: సాయంత్రం 5:00 గం.
సభాధ్యక్షత: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
👉 ముఖ్యఅతిథి: ఉప రాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు
సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక సమావేశం: సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్‌కు సత్కారం
సా. 6:30: డాక్టర్ రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడి కళాకారుల మన తెలంగాణ సంగీత నృత్య రూపకం
రా. 7.00 - 7:30: పాటకచేరి (లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ బృందం)
రా. 7:30 - 9:00: జయ జయోస్తు తెలంగాణ (సంగీత నృత్య రూపకం)

👉 డిసెంబర్ 16 కార్యక్రమాలు :
సా. 5గం.: తెలంగాణలో తెలుగు భాష వికాసం సాహిత్యసభ
సా. 6:30: సాంస్కృతిక సమావేశం
రా. 7:00- 7:30: శతగళ సంకీర్తన (భక్తరామదాసు సంకీర్తనల ఆలాపన)
రా. 7:30 -7:45: కళాకారుడు మైమ్ మధు ముకాభినయం ప్రదర్శన
రా. 7:45-8:00: వింజమూరి రాగసుధ నృత్యం
రా. 8:00-8:15: షిర్నాకాంత్ బృంద కూచిపూడి నృత్యం
రా. 8:15 - 9:00: డాక్టర్ అలేఖ్య నృత్యం

👉 డిసెంబర్ 17 కార్యక్రమాలు:
సా. 5:00: మౌఖిక వాఙ్మయం భాష సాహిత్యసభ
సా. 6:30: సాంస్కృతిక సమావేశం

👉 డిసెంబర్ 18 కార్యక్రమాలు:
సా. 5:00: తెలంగాణ పాట-జీవితం సాహిత్య సభ
సా. 6:30: సాంస్కృతిక సమావేశం

👉 డిసెంబర్ 19 కార్యక్రమాలు:
సాయంత్రం 5:00: ముగింపు వేడుక
👉 ముఖ్య అతిథి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

💥 బిరుదురాజు రామరాజు ప్రాంగణం (తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియం)
💥 సామల సదాశివ వేదిక
💥 డిసెంబర్ 16 కార్యక్రమాలు:
ఉదయం 10:00గం. తెలంగాణ పద్య కవితా సౌరభం (సదస్సు)
మధ్యాహ్నం 3:00. తెలంగాణ వచన కవితా వికాసం (సదస్సు)

💥 డిసెంబర్ 17 కార్యక్రమాలు:
ఉదయం 10:00గం. కథా సదస్సు
మధ్యాహ్నం 3:00గం. తెలంగాణ నవలా సాహిత్యం
సాయంత్రం. 6:00 గం. కథా,నవలా, రచయితల గోష్ఠి

💥 డిసెంబరు 18 కార్యక్రమాలు:
ఉదయం 10:00గం - తెలంగాణ విమర్శ - పరిశోధన
మధ్యాహ్నం 3:00గ. - శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం
సాయంత్రం. 6:00 గం. -కవి సమ్మేళనం

💥 డిసెంబరు 19:
ఉదయం 10:00గం - తెలంగాణలో తెలుగు - భాషా సదస్సు

🔴 గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ ప్రాంగణం (రవీంద్ర భారతి సమావేశ మందిరం )
🔴 డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక
🔴 డిసెంబర్ 16 కార్యక్రమాలు
ఉదయం 10:00 గం. అష్టావధానం
మధ్యాహ్నం 12:30గం. హాస్యావధానం
మధ్యాహ్నం 3:00గం. పద్యకవి సమ్మేళనం

🔴 డిసెంబర్ 17 కార్యక్రమాలు:
ఉదయం 10:00 గం. జంట కవుల అష్టావధానం
మధ్యాహ్నం 12:30గం. అక్షర గణితావధానం
మధ్యాహ్నం 3:00గం. అష్టావధానం
సాయంత్రం 5:30గం. నేత్రావధానం
సాయంత్రం 6:00గం. శ్రీప్రతాపరుద్ర విజయం (రూపకం)

🔴 డిసెంబర్ 18 కార్యక్రమాలు :
ఉదయం 10:00గం. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు
మధ్యాహ్నం 3:00గం. న్యాయ వ్యవహారాలు, ప్రభుత్వపాలనలో తెలుగు

🔴 డిసెంబర్ 19 కార్యక్రమాలు:
ఉదయం 10:00గం. తెలంగాణ చరిత్ర (సదస్సు)

🔴 అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం (ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌గార్డెన్)
🔴 వానమామలై వేదిక
డిసెంబర్ 16 ఉదయం 10:00 గం. నుంచి డిసెంబరు 19వ సాయంత్రం 4:00గం. వరకు - బృహత్ కవి సమ్మేళనం (ఏడు వందలమంది కవులతో కవి సమ్మేళనం)

🔴 డాక్టర్ యశోధారెడ్డి ప్రాంగణం ( రవీంద్రభారతి)
🔴 బండారు అచ్చమాంబ వేదిక
🔴డిసెంబర్ 16 కార్యక్రమాలు:
ఉదయం 10:00గం. బాల సాహిత్య సదస్సు
మధ్యాహ్నం 4:00గం. హరికథ (లోహిత)
మధ్యాహ్నం 4:30గం. నృత్యం (వైష్ణవి)
మధ్యాహ్నం 4:45గం. సంగీతం (రమాశర్వాణి)

🔴 డిసెంబర్ 17 కార్యక్రమాలు:
ఉదయం 10:00గం. బాలకవి సమ్మేళనం
మధ్యాహ్నం 3:00గం. తెలంగాణ వైతాళికులు (రూపకం)

🔴 డిసెంబర్ 18 కార్యక్రమాలు:
ఉదయం 10:00 గం. తెలంగాణ మహిళా సాహిత్యం (సదస్సు)
మధ్యాహ్నం 3:00గం. కవయిత్రుల సమ్మేళనం

🔴 డిసెంబర్ 19 కార్యక్రమాలు :
ఉదయం 10:00గం. ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు (విదేశీ తెలుగువారితో గోష్ఠి)
మధ్యాహ్నం 2:00గం. ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు (రాష్ర్టేతర తెలుగువారితో గోష్ఠి)

✅ మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం
✅ (
తెలంగాణ సారస్వత పరిషత్తు సభా భవనం)
✅ శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదిక
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 10:00గం. నుంచి రాత్రి 7:00 గం. వరకు శతావధానం

✅ పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ (రవీంద్రభారతి)
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 11:00గం. నుంచి రాత్రి 9:00గ. వరకు యువ చిత్రోత్సవం

✅ ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ (రవీంద్రభారతి)
డిసెంబర్ 16 నుంచి 19 వరకు కార్టూన్ ప్రదర్శన

✅ రవీంద్రభారతి ప్రాంగణం
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ఛాయాచిత్ర ప్రదర్శన

✅ చిత్రమయి ఆర్ట్‌గ్యాలరీ, మాదాపూర్
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ఛాయాచిత్ర ప్రదర్శన

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS