Friday, 1 December 2017

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి



  పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విజ్ఞాన, వినోద యాత్రలు చేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో కూడిన అనుమతి ఇచ్చింది.

 💥 ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విహార యాత్రలు వెళ్లేందుకు అనుమతి లేదు. అన్ని కోణాలనుంచి ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల మేధస్సు పెరగడానికి, ముఖ్యమైన ప్రదేశాలపై అవగాహన కలగడానికి విజ్ఞాన విహారయాత్రలు అవసరమని తెలిపింది.
💥 ఈ దిశలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అనుమతితో విద్యార్థులను యాత్రకు తీసుకెళ్లొచ్చని సూచించింది. కాగా, ప్రభుత్వం విధించిన నిబంధనలు విధిగా పాటించాలని స్పష్టంచేసింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.

💥 తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చునని, కానీ రాష్ట్రం దాటకూడదని అందులో తెలిపారు.
💥 10 జనవరి 2018 లోపు ఈ యాత్రలు పూర్తిచేయాలని నిర్ధేశించింది.
💥 అనుకూలమైన, మంచి సామర్ద్యం ఉన్న వాహనాన్ని, డ్రైవర్ ని ఎంపిక చేసుకోవాలి.
💥 ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితి లో ప్రయాణం చేయకూడదు.
💥 పర్యటన వివరాలు డి.ఇ. ఒ. గారికి తెలియచేసి అనుమతి పొందాలి.
💥 మరోవైపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.1.64కోట్లు విహారయాత్రకు విడుదల చేసింది.
💥 తెలంగాణ వ్యాప్తంగా 1963పాఠశాలలు ఉన్నాయి. వీరిలో 9, 10 తరగతి విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలకు అనుమతి ఇచ్చింది.
💥  100మంది విద్యార్థులు ఉన్న పాఠశాల నుంచే ఈ విహారయాత్రకు వెళ్లాలనే నిబంధన విధించింది.
💥 ఈ యాత్రకు ఒక్కో పాఠశాల నుంచి కేవలం 42 మంది విద్యార్థులు మాత్రమే వెళ్లాలని సూచించింది.
💥 ఒక్కో విద్యార్థికి రూ.200ఖర్చు చేయొచ్చని, 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు (1:15) టీం లీడర్గా ఉండాలని, విద్యార్థినులు ఉంటే మహిళా ఉపాధ్యాయులు ఉండాలని పేర్కొంది.
💥 పాఠశాల విద్యా కమిటీతో చర్చించి యాత్రను ఎంపిక చేయాలని సూచించారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS