Wednesday, 6 December 2017

34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంపు



👉 సెప్టెంబరు 30 వరకు అమలు 💥
👉 ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 💥
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు అందక ప్రకటన జారీల్లో జాప్యం!
👉ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. 2016లో పొడిగించిన వయోపరిమితి పెంపు గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగిసింది. దీంతో వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు పొడిగిస్తూ సోమవారం (డిసెంబరు 4) అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. నిరుద్యోగులకు ఉపశమనం కలిగించే ఈ వయో పరిమితి పెంపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ), ఇతర నియామక సంస్థల ద్వారా నేరుగా జరిగే ఉద్యోగాల భర్తీకి మాత్రమే వర్తిస్తుంది. పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖ (యూనిఫామ్డ్) ఉద్యోగాల భర్తీకి మాత్రం వర్తించదు. వీటి భర్తీలో ప్రత్యేక విధివిధానాలు ఉన్నాయి. శారీర దారుఢ్యం, ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు.

👉 ఏపీపీఎస్సీకి అందని ఉద్యోగ ఖాళీల వివరాలు!
👉వయోపరిమితి పెంపునకు తగినట్లు ఉద్యోగాల భర్తీ ప్రకటనలు వెలువడితే నిరుద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రకటనల జారీకి మాత్రం ఇంకా మార్గం సుగమం కాలేదు. ఈ ఉద్యోగాల భర్తీ సమాచారం ఆర్థికశాఖ నుంచి ఏపీపీఎస్సీకి వెళ్లితేనే ప్రకటనల జారీకి తదుపరి చర్యలు సుగమం అవుతాయి. తాజాగా ముగిసిన మంత్రివర్గ సమావేశం ద్వారా ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సూచనప్రాయంగా చెప్పారు. కానీ..మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీ గురించిన ప్రస్తావన కనిపించలేదు. వార్షిక పట్టిక(క్యాలెండర్) ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీచేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించినప్పటికీ ఆదిలోనే అవరోధాలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు రానందున ప్రకటనలు జారీ చేయలేకపోతున్నామని ఏపీపీఎస్సీ వర్గాలు వివరణ ఇచ్చాయి. 4700 వరకు ఉద్యోగ ఖాళీల భర్తీ సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. ఇవికాకుండా భర్తీకానీ పోస్టుల వివరాలు ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు పూర్తిస్థాయిలో అందిన వెంటనే అన్నింటికీ కలిపి ప్రకటనల జారీకి ఉపక్రమిస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS