Monday, 18 December 2017

20 నుంచి రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన



👉 తెలంగాణ రాష్ట్రస్థాయి సైన్స్, గణిత, పర్యావరణ వైజ్ఞానిక ప్రదర్శన నెల 20 నుంచి 22 తేదీవరకు వరంగల్ అర్భన్ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ డైరెక్టర్ బీ శేషుకుమారి తెలిపారు.
👉 హన్మకొండలోని వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
👉 జిల్లాస్థాయిలో ఎంపికైన జూనియర్, సీనియర్, ఉపాధ్యాయ విభాగాలకు చెందిన ఎగ్జిబిట్లు రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు తెలిపారు. జూనియర్ విభాగంలో 6, సీనియర్ విభాగంలో 6, ఉపాధ్యాయ కేటగిరిలో ఒకటిచొప్పున ప్రతి జిల్లా నుంచి 13 ప్రాజెక్టులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
👉 ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, అర్బన్ జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్నట్లు తెలిపారు.
👉 2018, జనవరి 8 నుంచి 12 వరకు హైదరాబాద్లో దక్షిణభారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు.
👉 సమావేశంలో డీఈవో కే నారాయణరెడ్డి, జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డీఎస్ జగన్, వివిధ జిల్లాల సైన్స్ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS