Wednesday, 6 December 2017

10 జిల్లాల ఉపాధ్యాయ ఖాళీలు టీఎస్‌పీఎస్సీకి



💥 త్వరలో టీఆర్టీ కొత్త నోటిఫికేషన్‌ 💥
💥 పాతవారు దరఖాస్తు చేయక్కర్లేదు 💥
💥 కొత్తవారు 15 వరకు చేసుకోవచ్చు 💥

👉 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 10 జిల్లాల ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ మంగళవారం టీఎ్‌సపీఎస్సీకి అందజేసింది. ఈ వివరాలను పరిశీలించిన అనంతరం టీఎ్‌సపీఎస్సీ ఖాళీల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలను 31 జిల్లాల ప్రకారం కాకుండా 10 జిల్లాల ప్రాతిపదికనే భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణలో 8792 పోస్టుల భర్తీకి అక్టోబరు 21న టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఖాళీలను 31 జిల్లాల ప్రకారం భర్తీ చేసేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించడంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన కోర్టు 10 జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

👉 నేపథ్యంలో ఖాళీలను 10 జిల్లాల ప్రాతిపదికన తీసుకున్నారు. పోస్టుల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పది జిల్లాల ప్రాతిపదికనే తీసుకోవడంతో కొన్ని జిల్లాల్లో పోస్టులు భారీగా పెరగనున్నాయి. అదేవిధంగా రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్‌ తదితర అంశాలను కూడా గతంలో మాదిరిగానే పరిగణనలోకి తీసుకోనున్నారు. 10 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అందుకున్న టీఎ్‌సపీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. తొలిదశలో ఖాళీల వివరాలను సమీక్షిస్తోంది. ఇది పూర్తవగానే రోస్టర్‌ పాయింట్లు, భర్తీ విధానాలను పరిశీలించనుంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

👉 ఇదిలా ఉంటే పాత జిల్లాల పరిధిని విభజించడంతో ప్రస్తుతం తెలంగాణలో 31 జిల్లాలకు డీఈవోలు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత జిల్లా పేరుతో ఉన్నటువంటి డీఈవోను నోడల్‌ అధికారిగా నియమించి నియామక పత్రాలను అందించే అవకాశం ఉంది.టీఆర్‌టీకి ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. కొత్త వారు మాత్రం ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS