Friday, 10 November 2017

Telangana State Secondary School Certificate Public Examinations, March, 2018



👇 👇 పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు 👇 👇
👉 మార్చి 15 నుంచి ఓఎస్సెస్సీ
👉 మార్చి 19 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు
👉 వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల


👉 తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 15 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం గురువారం (నవంబరు 9) షెడ్యూల్ను ఖరారు చేసింది. అధికారుల ప్రతిపాదనకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదం తర్వాత కాలపట్టికను విడుదల చేశారు. మార్చి 15 నుంచి మొదటి మూడు రోజులు ఓరియంటల్ ఎస్ఎస్సీ, వృత్తి విద్య కోర్సు విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. పదో తరగతి అసలు పరీక్షలు 19 తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్షలు మార్చి 31 తేదీకి ముగుస్తాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు కొన్ని, మధ్యాహ్నం 12.45 గంటల వరకు మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పేపర్ (పార్ట్-బి)ని చివరి అరగంటలో మాత్రమే ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్ తెలిపారు. ఏపీలో పది పరీక్షలు మార్చి 15 ప్రారంభమై 29 ముగియనున్నాయి.
తెలంగాణ పరీక్షల కాలపట్టిక ఇదీ...
తేదీ                                      సబ్జెక్టు
మార్చి 15 (గురువారం)        ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
16 (
శుక్ర)                             ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
17 (
శని)                               ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు
19 (
సోమ)                            ప్రథమ భాష పేపర్-1, కాంపోజిట్ కోర్సు పేపర్-1
20 (
మంగళ)                         ప్రథమ భాష పేపర్-2, కాంపోజిట్ కోర్సు పేపర్-2
21 (
బుధ)                              ద్వితీయ భాష( తెలుగు/ హిందీ)
22 (
గురు)                              ఆంగ్లం-1
23 (
శుక్ర)                               ఆంగ్లం-2
24 (
శని)                                గణితం-1
26 (
సోమ)                            గణితం-2
27 (
మంగళ)                         జనరల్ సైన్స్-1
28 (
బుధ)                            జనరల్ సైన్స్-2
29 (
గురు)                            సాంఘిక శాస్త్రం-1
31 (
శని)                               సాంఘిక శాస్త్రం-2
గమనిక: ఓఎస్ఎస్సీ రెండు పరీక్షలు, 19 జరిగే కాంపోజిట్ కోర్సు, 21 ద్వితీయ భాష పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉదయం 11.30 గంటల వరకు, 20 జరిగే కాంపోజిట్ కోర్సు పేపర్-2 పరీక్ష ఉదయం 10.45 గంటల వరకు మాత్రమే ఉంటాయి.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS