Wednesday, 15 November 2017

Telangana Intermediate Public Examinations Starts From 28th February 2018



👇👇 ఫిబ్రవరి 28 నుంచే ఇంటర్పరీక్షలు 👇👇
👇👇 తెలంగాణలో మారిన కాలపట్టిక 👇👇
👉 తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కాలపట్టిక మారింది. ఇంతకుముందు ప్రకటించినట్లు మార్చి 1 తేదీ నుంచి కాకుండా ఫిబ్రవరి 28 తేదీ నుంచే పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 19 తేదీకే ముగుస్తాయి. వారం రోజుల క్రితం మార్చి 1 తేదీ నుంచి 20 తేదీవరకు ఇంటర్పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్బోర్డు ప్రకటించడం తెలిసిందే. అప్పటికే ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 28 తేదీ నుంచి మార్చి 19 తేదీవరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రశ్నపత్రాలపై ఏపీ లేదా తెలంగాణ అని ఉండదు కాబట్టి.. ప్రశ్నపత్రం లీకయిందంటూ వాట్సాప్తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగే అవకాశం ఉండటంతో అధికారులు పునరాలోచించారు. రెండు రాష్ట్రాల్లో సిలబస్ ఒకటే కాబట్టి ఏపీ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలే తెలంగాణలో కొన్ని వచ్చినా సమస్యలు ఎదురవుతాయని తెలంగాణ ఇంటర్బోర్డు భావించింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల్లో ఒకే కాలపట్టిక ఉంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భావించిన అధికారులు పరీక్షలను ఏపీలో మాదిరిగా ఫిబ్రవరి 28 తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
👉 తాజా నిర్ణయం ప్రకారం ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులకు మార్చి 14 తేదీతోనే పరీక్షలు ముగుస్తాయి. 👉 ఇంటర్, ఒకేషనల్సైన్స్కోర్సుల వారికి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు.
👉 ఇక తప్పనిసరిగా రాయాల్సిన నైతికత, మానవీయ విలువల పరీక్ష జనవరి 27, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 29 ఉంటాయి. రెండు పరీక్షలనూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS