Thursday, 16 November 2017

మీ SBI అకౌంట్‌కి ఆధార్ అనుసంధానం చేయండిలా



🛑 *మీ SBI అకౌంట్‌కి ఆధార్ అనుసంధానం చేయండిలా..( సింపుల్ ట్రిక్స్ )*

🌀 *దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులు ఈ ఏడాది డిసెంబరు 31వతేదీలోగా తమ ఆధార్ నంబరును అనుసంధానించకుంటే ఖాతా లావాదేవీలను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.*

🌀 *ఖాతాదారులు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంకు ఎనీవేర్ మొబైల్ యాప్, ఏటీఎం, బ్యాంకు బ్రాంచీల ద్వారా తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవచ్చని ఎస్బీఐ అధికారులు చెప్పారు.*

👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾👇🏾

(1).🛑 *ఆన్‌లైన్ ద్వారా ఆధార్ నమోదు*#:-

🌀 *ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేసి మీ యూజర్ నేమ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేశాక ఈ-సర్వీసుపై క్లిక్ చేయండి.*

🌀 *అనంతరం 'లింక్ యువర్ ఆధార్ నంబరు' లింక్ ను క్లిక్ చేసి ప్రొఫైల్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.*

🌀 *అనంతరం ఆధార్ నంబరు ఎంటర్ చేస్తే మీ ఎస్బీఐ ఖాతాకు మీ ఆధార్ అనుసంధానం అవుతుంది.*

(2)🛑 *ఎసెమ్మెస్ ద్వారా నమోదు*#

🌀 *మీ రిజిస్టర్ మొబైల్ నుంచి UID (space) Aadhaar number (space) Account number టైప్ చేస్తే మీకు ఓ మెసేజ్ వస్తుంది.*.

🌀 *అది వాలిడ్ అని ఉంటే మీ మీ పని విజయవంతమయినట్లే రిజిస్టర్ మొబైల్ నంబరు నుంచి మాత్రమే చేయాలి.*

(3).🛑 *ఏటీమ్ ద్వారా నమోదు*#

🌀 *ఎస్ బిఐ ఏటీఎంలో మీ ఎటీఎం కార్డు స్వైప్ చేయగానే పిన్ అనే ఆప్సన్ వస్తుంది.*

🌀 *అది ఎంటర్ చేసిన తరువాత 'Service- Registrations కెళ్లి*

🌀 *Aadhaar Registration చేసుకోవచ్చు. అక్కడి మీకు వచ్చే సూచనలు ఫాలో కావాల్సి ఉంటుంది.*

(4).🛑 *బ్రాంచ్ ల ద్వారా నమోదు*#

🌀 *మీకు దగ్గరలో ఉన్న SBI బ్రాంచ్ కెళ్లి అక్కడ మీరు ఆధార్ కాపీ ఇస్తే సరిపోతుంది.*

🌀 *అక్కడ ప్రాసెస్ పూర్తి కాగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.*

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS