Thursday, 23 November 2017

Questions And Answers In Teachers Service Rules



👇👇 సందేహాలు - సమాధానాలు 👇👇

*🏀 ప్రశ్న:*
PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా??

*🎾 జవాబు:*
వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప,సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.

*🏀 ప్రశ్న:*
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు??

*🎾 జవాబు:*
ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.

*🏀 ప్రశ్న:*
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు??

*🎾 జవాబు:*
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.

*🏀 ప్రశ్న:*
ఐటీ రిటర్న్ అందరూ సమర్పించాలా??

*🎾 జవాబు:*
2,50,000రూ ఆదాయం దాటిన వారందరూ ఆగస్టు 31లోగా రిటర్న్ దాఖలు చెయ్యాలి. వేతన ఆదాయం మాత్రమే ఉన్నవారు ITR--1 ఫారంలో ఈ--ఫైలింగ్ చేయవచ్చు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS