Saturday, 25 November 2017

Google మీ మీద నిరంతరం నిఘా పెడుతోందట..




👉  ప్రపంచంలో భార్యాభర్తలకి మధ్యా, తల్లిదండ్రులకీ పిల్లలకీ మధ్యా, ఫ్రెండ్స్‌కి మధ్య ఒకరికొకరికి తెలియని సమాచారం కూడా Google వద్ద ఉంటుందనడంలో అతిశయోక్తే లేదు. ఇంకా చెప్పాలంటే మన గురించి మనకన్నా Google కే బాగా తెలుస్తుంది.

👉 అన్ని పద్ధతులతో పాటు Google నిరంతరం మనం ఎక్కడ ఉన్నామో మన Location ని కూడా ట్రాక్ చేస్తుంటుంది, అది అందరికీ తెలిసిందే. అందుకే కొంతమంది Location సర్వీస్‌ని తమ phoneలో డిసేబుల్ చేస్తుంటారు. అయినా ఉపయోగం లేదు. GPSతో పనిలేకుండానే మీరు ప్రస్తుతం ఉన్న Cell Tower ఆధారంగా మీ లొకేషన్‌ని Google ట్రాక్ చేస్తున్నట్లు తాజాగా వెల్లడైంది.

👉 గత 11 నెలలుగా Google ఈ పని చేస్తోందట. ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి Push Notifications నీ, ఇతర సేవలను అందించడం కోసం మీకు తెలీకుండా Google ఇలా మీ సెల్ టవర్ సమాచారాన్ని వాడుకుంటోంది. ఎప్పటికప్పుడు మీ Android Phone తాను ఉన్న సెల్ టవర్ లొకేషన్‌ని Google కి పంపిస్తోంది. ఈ విషయంపై Google మొత్తానికి స్పందించింది.

👉 నవంబర్ నెలాఖరు నుండి ఇలా cell tower వివరాలను Android Phone ల నుండి పొందడం నిలిపి వేస్తున్నట్లు Google ప్రతినిధి తెలిపారు. వినియోగదారులకి మెరుగైన సేవలను అందించడానికి తప్పించి ఈ cell tower dataని ఏ విధంగానూ Google దుర్వినియోగం చెయ్యట్లేదని ఆ ప్రతినిధి వెల్లడించారు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS