Thursday, 16 November 2017

Google Maps లో ఇప్పుడు సూపర్ మార్పులు!



👉 ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనందరికీ మొదట గుర్తొచ్చేది Google Mapsనే. ఈ appలో ప్రస్తుతం అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
👉 మీరు ప్రస్తుతం చేస్తున్న పనికి తగ్గట్లు Google Maps ఇకపై నడుచుకోబోతోంది. ఉదాహరణకి మీరు కారులో ప్రయాణం చేస్తున్నారనుకుందాం. Google Mapsలో పెట్రోల్ బంకులు ప్రత్యేకంగా చూపించబడతాయి. అలాగే bus, trainలో ప్రయాణిస్తుంటే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రధానంగా చూపించబడతాయి. అంటే మనం చేసే పనిని బట్టి మనకు అవసరమైన సమాచారాన్ని చూపిస్తాయన్న మాట.
👉 అలాగే కేఫ్‌లు, రెస్టారెంట్లు, bank, atm, parking, pharmacy, hotel వంటి వివిధ ప్రదేశాల్ని సులభంగా గుర్తించగలిగే విధంగా సరికొత్త color schemeని Google Mapsలో ప్రవేశ పెట్టారు. ఉదాహరణకి మీకు దగ్గరలో ఏదైనా రెస్టారెంట్‌ని మీరు వెదకదలుచుకుంటే అది ఆరెంజ్ గుర్తుతో చూపించబడుతుంది. హాస్పిటల్, ఫైర్ వంటి అత్యవసరమైనవన్నీ రెడ్ కలర్‌తోనూ.. బ్యాంక్, ATM లాంటి ఇతర సర్వీసులన్నీ బ్లూ కలర్‌తోనూ కన్పిస్తాయి.
👉 అంటే వివిధ ప్రదేశాలను సులభంగా గుర్తించడానికి ప్రత్యేకమైన చిహ్నాన్ని మాత్రమే కాకుండా ఆయా చిహ్నాలకు ప్రత్యేకమైన రంగులను కూడా Google Maps కొత్తగా ప్రకటించింది. Google Maps ఆధారంగా సమాచారాన్ని అందించే Google Assistant, Search, Earth, Android Auto వంటి appsలో కూడా ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS