Thursday, 2 November 2017

Employee Gratuity Extended Up To 20 Lakhs Rupees



🌷వేతన జీవులకు వూరట!

🔹 గ్రాట్యుటీ పరిమితి రూ. 20 లక్షలకు పెంపు

🔹త్వరలో పార్లమెంటుకు బిల్లు

🌷కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

🌷ఈ మేరకు గ్రాట్యుటీ చెల్లింపుల చట్టానికి సవరణ చేస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

🌷 ప్రభుత్వ నిర్ణయంతో పలువురు ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

🌷 ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది.

 🌷పదవీ విరమణ తర్వాత కంపెనీ తరఫున వచ్చే గ్రాట్యుటీ మరింతగా అందనుంది.

🌷 ఏడేళ్ల కిందట గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు.

 🌷ఈ పెంపుతో అప్పట్లో కొందరు కార్మికులు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగినప్పటికీ.. ఆ తర్వాత ద్రవ్యోల్బణం పెరిగింది.

🌷ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతన సవరణ జరిగింది. ప్రైవేటులోనూ అధిక వేతనాలిచ్చే సంస్థలు వచ్చాయి.

🌷ఈ నేపథ్యంలో పదవీ విరమణ సమయంలో లభించే ప్రయోజనాలు తగ్గిపోతున్నాయి.

🌷 కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రాట్యుటీ పెంపు ప్రయోజనాలు ఉన్నత ఉద్యోగులకు మినహా మధ్య, చిన్నస్థాయి పోస్టుల్లో పనిచేసేవారికి పెద్దగా దక్కవని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

🌷తక్కువ స్థాయి పోస్టులో పనిచేసే ప్రైవేటు కార్మికులు, ఉద్యోగులకు పదవీవిరమణ సమయంలో గ్రాట్యుటీ రూ.2లక్షలు దాటడం లేదని చెబుతున్నాయి.

🔹గ్రాట్యుటీ లెక్కింపు ఇలా

🌷 ఏదేని సంస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులు అర్హులు.

 🌷ఐదేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత పదవీ విరమణ చేసినా, ఉద్యోగం వదిలినా గ్రాట్యుటీ ఇస్తారు.

 🌷ఉద్యోగి సర్వీసులో ఉన్నపుడే మరణిస్తే అతని పదవీ విరమణ నాటికి ఎన్నేళ్ల సర్వీసు అవుతుందో ఆ మొత్తం కాలానికి గణించి చెల్లిస్తారు.

🔹ఇదీ ఫార్ములా

🌷(మూలవేతనం+కరవు భత్యం) x 15 xసర్వీసు కాలం (ఏళ్లు)/26

No comments:

Post a Comment

Popular Posts