Sunday, 5 November 2017

Does The Gas Subsidy Fall Off The Account? What To Do👉 గ్యాస్ సబ్సిడీ సొమ్ము ఖాతాలో పడటం లేదా ఏం చేయాలి

👉 రమేష్ ఎప్పటిలాగే గ్యాస్‌ బుక్‌ చేశాడు.. గ్యాస్‌ సిలిండర్‌ వచ్చింది. కానీ రావాల్సిన రాయితీ మాత్రం ఇంకా పడలేదు.. వారం అయ్యింది. తనకు ఎప్పుడు రాయితీ పడే బ్యాంకు ఖాతా తనిఖీ చేసుకున్నా ఫలితంలేదు... డీలర్‌ను సంప్రదిస్తే మీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందని చెబుతున్నాడు. ఈ సమస్య ఒక్క శీనుదే కాదు చాలా మంది ఈ తరహాలోనే ఇబ్బంది పడుతున్నారు.. ఎక్కడ సమస్య ఉందో తెలుసుకోవాలంటే మీ చేతిలో ఉన్న మొబైల్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది... సమస్యను గుర్తించడం.. దాన్ని పరిష్కరించడం ఎలాగో చూద్దాం....
💥 💥 గ్యాస్ యాజమాన్య సంస్థలను సంప్రదించడం 💥 💥
💥 మీ మొబైల్‌లో*99*99# నొక్కితే ఏ బ్యాంకు ఖాతాకు వెళుతుందో తెలుస్తుంది
💥 అన్ని గ్యాస్‌ సంస్థల ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నం.18002333555
💥 హెచ్‌పీ 24 గంటల కాంటాక్ట్ నంబరు - 96660 23456
💥 భారత్ గ్యాస్ 24 గంటల కాంటాక్ట్ నంబరు9440156789

🔥 🔥 చివరిసారి ఆధార్‌ ఇచ్చిన చోటే జమవుతుంది..
ఎప్పుడూ పడే గ్యాస్‌ రాయితీ ఈ నెల పడలేదు అనగానే మొదట వేరే బ్యాంకు ఖాతాకు కొత్తగా ఆధార్‌ నంబర్‌ జత చేశారేమో చూసుకోవాలి. నిత్యం వాడే ఖాతా కాకుండా ఏదైనా బ్యాంకు రుణం కోసం కొత్తగా తెరిచిన ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేస్తున్నారు. ఆ సమాచారం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ఇండియా (ఎన్‌పీసీఐ) కు వెళుతుంది.. ఆటోమేటిగ్గా రాయితీ పడే ఖాతా మారిపోతుంది.. ఆ విషయం తెలియక ఎప్పుడూ పడే ఖాతాలోనే చూసుకుంటాం.. దాంతో సమస్య వస్తోంది. అది ఏ ఖాతాలో పడుతుందో మీ మొబైల్‌ ద్వారానే తెలుసుకోవచ్చు.. మొబైల్‌లో*99*99# నొక్కి డయల్‌ చేయాలి.. వెంటనే మీ ఆధార్‌ నంబరు అడుగుతుంది.. దాన్ని ఎంటర్‌ చేసి కన్ఫమ్‌ చేయడానికి 1 నొక్కాలి.. అంతే మీ ఆధార్‌ నంబరు చూపిస్తూ అది ఏ బ్యాంకుకు అనుసంధానమైందో.. చివరి సారి ఎప్పుడు రాయితీ పడిందో చెబుతుంది..

🔥 🔥 కాల్‌ సెంటర్ ద్వారా తెలుగులో మాట్లాడొచ్చు
మనం వాడేది భారత, హెచ్‌పీ, ఇండియన్‌ గ్యాస్‌లలో ఏదైనా సరే సమస్య వస్తే మూడింటికి కామన్‌గా ఉన్న 18002333555 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదివ్వొచ్చు. గ్యాస్‌ సమస్య అనగానే ముందు ఇంట్లోని గృహిణికే ఇబ్బంది.. వారు కాల్‌సెంటర్‌ అనగానే ఆంగ్లంలోనో.. హిందీలోనో మాట్లాడుతారని కంగారు పడుతుంటారు.. కాని దీంట్లో ఇంగ్లిష్‌, హిందీతోపాటు ప్రధానమైన భారతీయ భాషలైన తెలుగు, కన్నడం, తమిళం, మళయాళంలో మాట్లాడే ప్రతనిధులు ఉంటారు. ఈ నంబరుకు చేసి తెలుగు కోసం 3 నొక్కి ఎంపిక చేసుకోవాలి.. ఆ తరవాత ఏ గ్యాస్‌ సంస్థ అనేది నంబరు ద్వారా ఇవ్వాలి.. ఇండియన్‌ గ్యాస్‌ కోసం 1 నొక్కాలి, హిందుస్థాన్‌ పెట్రోలియం (హెచ్‌పీ) కోసం 2, భారత గ్యాస్‌ కోసం 3 నొక్కాలి.. ఇప్పుడు రాయితీ సమస్య అయితే 1, ఇతర సమస్యల కోసమైతే 2 నొక్కి వేచి ఉండాలి.. సంబంధిత గ్యాస్‌ సంస్థ ప్రతినిధి మీతో మాట్లాడుతారు.. మన సమస్య చెప్పి ఫిర్యాదు నంబరు (ఎస్‌ఆర్‌ నంబరు) తీసుకోవాలి. ఆ నంబరు మన మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది.

👉 ఏ తరహా సమస్యలకు ఫిర్యాదు?
👉 రాయితీ సమస్యలకు ఫిర్యాదు చేయొచ్చు
👉 గ్యాస్‌ తూకం తగ్గినా..
👉 సీల్‌ లేకుండా వచ్చి ఇచ్చినా..
👉 బుక్‌ చేసినా నిర్ణీత సమయంలో డెలెవరీ చేయకపోయినా..
👉 గ్యాస్‌ డీలరు మోసం చేసినా..
👉 వీటితోపాటు గ్యాస్‌కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఈ కాల్‌ సెంటర్‌ను సంప్రదించొచ్చు.

పాత ఖాతాకే రాయితీ పడాలనుకుంటే....
కొత్తగా రాయితీ పడే బ్యాంకు ఖాతాలో కాకుండా గతంలో పడే అకౌంట్‌లోనే పడాలనుకుంటే.. ఆ బ్యాంకుకు వెళ్లి ఒక ఆధార్‌ జిరాక్స్‌ ఇచ్చి తన ఖాతాకి అనుసంధానం చేయాలని అడగాలి.. ఒక వేళ ఇప్పటికే జతచేసి ఉందని బ్యాంకు అధికారులు చెబితే, రాయితీ వేరే ఖాతాకు వెళ్లిన విషయం చెప్పి ఎన్‌పీసీఐ సర్వర్‌కు అనుసంధానం చేయాలని తెలియజేయాలి.

రాయితీ లావాదేవీ ఫెయిలైతే..
ఎన్‌పీసీఐ నుంచి రాయితీ మన ఖాతాకు పంపినా లావాదేవీ ఒక్కోసారి ఫెయిలైతే.. వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. అప్పుడు లావాదేవీకి సంబంధించిన సమస్యను సరిచేస్తారు.. అవసరం అనుకుంటే మళ్లీ ఆధార్‌ నంబరు తీసుకుని అప్‌డేట్‌ చేస్తారు..

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS