Wednesday, 8 November 2017

Compulsory Permission To Summer Classes For Intermediate



*⚡️వేసవిలో తరగతులకు అనుమతులు తప్పనిసరి*

🔷యజమాన్యాలు, తల్లిదండ్రులతో సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం

ఇక నుంచి ఇంటర్ప్రథమ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో కోచింగ్ఇవ్వడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వీల్లేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సృష్టంచేశారు. రెండో సంవత్సరం పూర్తయిన వారికి వేసవిలో శిక్షణ ఇచ్చేందుకు అనుమతులు తీసుకోవాలన్నారు.

కర్పొరేట్కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో మంగళవారం ఆయన సచివాలయంలో కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఇక కళాశాలలకు అనుబంధంగా నడిచే హాస్టళ్లకు కూడా అనుమతులు తప్పనిసరని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరానికి(2018-19)కి మార్చి 31 తేదీ నాటికే కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇస్తామని.. వేటికి అనుమతి ఉందో జాబితాను వెబ్సైట్లో పెడతామన్నారు.

కొన్ని ప్రైవేట్, కార్పొరేట్కళాశాలలు వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే ప్రవేశాలు ప్రారంభించినట్లు తమ వద్ద సమాచారం ఉందని.. దాన్ని ఆపాలని, ఇంటర్బోర్డు ప్రవేశాలకు ప్రకటన జారీ చేసిన తర్వాతే ప్రవేశాలు జరపాలని ఆయన తేల్చిచెప్పారు. ఆలోపు ప్రవేశాలు తీసుకుంటే కళాశాలల గుర్తింపును రద్దు చేయడంతోపాటు వారిపై క్రిమినల్కేసులు పెడతామని హెచ్చరించారు. కళాశాలలు పీఆర్ వ్యవస్థకు స్వస్తి పలకాలని సూచించారు. ఇప్పటికే అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టళ్లను గుర్తించి నోటీసులు ఇచ్చామని, కళాశాలల్లోని వసతులు లేమి, నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు కూడా జారీ చేశామని చెప్పారు. 15 రోజుల్లో సమాధానం చెప్పాలని వాటిని ఆదేశించామన్నారు. కొన్ని కళాశాలలు విద్యార్థులు తినడానికి కూడా సమయం ఇవ్వడం లేదని.. అకడమిక్క్యాలెండర్ను అసలే పాటించడం లేదన్నారు.

*ముఖ్యమైన మరికొన్ని నిర్ణయాలు*
* ఆదివారాలు, సెలవుల్లో తరగతులు నిర్వహించరాదు
* ప్రతి కళాశాలలో ఫిర్యాదుల పుస్తకం ఉంచాలి. విద్యార్థులు, తల్లిదండ్రులకు దాన్ని అందుబాటులో ఉంచాలి.
* కౌన్సెలింగ్కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS