Sunday, 5 November 2017

Children’s Societies In Govt. Schools And Their Participationప్రభుత్వ పాఠశాలల్లో బాలల సంఘాలు వాటి విధులు

*💧 బాలల సంఘాలు అంటే బాలలతో ఏర్పరిచే సంఘాలే!*

*💧 విద్యార్ధులే పాఠశాలల్లో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని బాధ్యత వహించడానికి బాలల సంఘాలు ఉపయోగపడతాయి.*

*💧 ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలి.*

 *💧 ప్రధానోపాధ్యాయుడు మానిటరింగ్‌ చేయాలి.*

*💧 పాఠశాల స్థాయిలో ఈ క్రింది కమిటీలు విధిగా తమ విధులను నిర్వహించాలి.*

*💧 ప్రతి కమిటీలో తరగతికి ఒక్కరు చొప్పున అయిదుగురు ఉంటారు.*

*💧 1. సమాచార కమిటీ:*

👉 బడిమానివేసిన / తరచు గైర్హాజరపుతున్న పిల్లల వివరాలు సేకరించి ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులకు అందజేయుట. ప్రార్ధనా సమావేశాలలో ప్రతి రోజు వార్తలు చదవడం.

*💧 2.ఆరోగ్య / పరిశుభ్రత కమిటీ*:

👉 పిల్లల పరిశుభ్రతను పరిశీలించడం, తరగతి గదిలో చెత్త డబ్బాలు ఏర్పాటు చేయడం, వ్యాధుల పట్ల అవగాహన కలిగించుట.

*💧 3. ఆటలు / సాంస్కృతిక కమిటీ:*

👉 కాలనిర్ణయ పట్టిక ప్రకారం ఆటలు ఆడేలా చూడడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో పాల్గొనడం.

*💧 4. గోడ పత్రిక కమిటి*

👉 ప్రతి రోజు పిల్లలు, టీచర్లు, రాసిన లేక తెచ్చిన కార్టూన్లు, కవితలు మొదలయిన ఇతర సమాచారం గీసిన బొమ్మలను గోడపత్రికలో ఉంచడం.

*💧 5. గ్రంథాలయ కమిటీ:*

👉 ప్రతిరోజు రీడింగ్‌ సమయంలో పిల్లలకు పుస్తకాలిచ్చి వాటి వివరాలను నమోదు చేయడం, పఠన సామగ్రిని సేకరించడం.

*💧 6 .మధ్యాహ్న భోజన కమిటీ:*

👉 ప్రతి పాఠశాల నుండి తరగతికి ఇద్దరి చొప్పున విద్యార్ధులను ఎంపిక చేసి మధ్యాహ్న భోజన కమిటీ ఏర్పాటు చేసి వారి పేర్లు ప్రదర్శించాలి.
ఈ కమిటీకి చైర్మన్‌గా ప్రధానోపాధ్యాయులు పి. ఇ .టి / ఆసక్తికరమైన ఉపాధ్యాయుడు ఇన్‌చార్జీగా ఉంటారు.
👉 మధ్యాహ్న భోజన కమిటీ సభ్యులు, మెను ప్రకారం భోజనం తయారు చేస్తున్నారా, రుచికరంగా, శుభ్రంగా ఉంటుందా చూడాలి.
👉 మధ్యాహ్న భోజన సమయంలో తరగతి వారీగా విద్యార్ధులను వరుసలలో నిలబెట్టి వారి ప్లేట్లు కడుక్కోనేటట్లు చూడాలి.
👉 తరగతి వారీగా భోజనం అందించి కూర్చోనిబెట్టాలి.
👉 అల్లరి కాకుండా చూడాలి.
👉 పాఠశాల / తరగతి ఆవరణ శుభ్రంగా ఉండునట్లు Dust Bins ఉపయోగించునట్లు విద్యార్ధులకు అవగాహన కల్పించాలి.
👉 వారికి తాగు నీటి వసతి అందునట్లు చూడాలి.
👉 విద్యార్ధులందరు తిన్న తర్వాత, మధ్యాహ్న భోజన కమిటీ సభ్యులు తినాలి.
👉 మాస వారీగా సమీ క్షించుకోవాలి.
👉 సమీ క్షలో తీసుకొన్న నిర్ణయాలు అమలగునట్లు చూడాలి

*💧 7. పాఠశాలలో నిర్వహించవలసిన కార్యక్రమాలు*

*💧 ఉద్దేశ్యం*

👉 పిల్లల్లోని బహుముఖ ప్రతిభను వెలికితీయడానికి, మంచి వైఖరులను నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడానికి పిల్లల్లో సహకారం, సంఘీభావం కలిసి పనిచేయడం తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం, స్నేహభావం, స్వీయ క్రమశిక్షణ అలవర్చడం కోసం.

 *💧 1. ప్రార్ధన:*

🔸 పిల్లలచే స్వల్ప వ్యాయామ కృత్యాల నిర్వహణప్రార్ధన గీతాన్ని శ్రావ్యంగా, రాగభావయుక్తంగా, సామూహికంగా పాడించాలి.

🔸 రాష్ట్ర గీతం, ప్రతిజ్ఞను నిర్వహింపజేయాలి.

🔸 సేకరించిన నేటి వార్తలు చదివించాలి.

🔸 ఒక మంచి మాట (సూక్తి) చెప్పించాలి.

🔸 నేటి ప్రశ్న - మీ సమాధానంలో ప్రశ్నను అడగాలి.

🔸 బాలల సంఘాలచే పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలింపజేయాలి. తగు సూచనలు అందజేయాలి.

🔸 ప్రాముఖ్యత గల రోజులల్లో ఆ రోజుకు సంబంధించిన సూచనలు అందజేయాలి.

🔸 పిల్లల డైరీ, గోడపత్రిక, స్కూల్‌ పోస్టు బాక్స్‌లోని మంచి ఉత్తరాలు రాసిన, మంచి అంశాలు ప్రదర్శించిన పిల్లలను అభినందించాలి, ప్రోత్సహించాలి.

*💧 2. తరగతి గది గ్రంథాలయం:*

👉 పిల్లల అభిరుచికి తగినట్లుగా కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గేయాలు, సమాచార సాహిత్యం పిల్లలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి చదివించాలి. పిల్లలతో వారు చదివిన పుస్తకాలపై సమీ క్షలు రాయించాలి.

*💧 3. పిల్లల డైరీ:*

👉 పిల్లలు తమ ఆలోచనలు, ఇష్టాయిష్టాలను క్రమ పద్ధతిలో వ్యక్తీకరించే పుస్తకం. పిల్లల సహజ స్పందనలు అక్షర రూపంలో పొందేందుకై డైరీ ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉపాధ్యాయుడు డైరీలను పరిశీలించాలి.

*💧 4. గోడ పత్రిక:*

👉 పిల్లలు అభిప్రాయాలను వ్యక్తం చేయటం వారి హక్కు. గోడ పత్రిక వారి ఆలోచనలు, అనుభూతులు, అభిప్రాయాలు, అభిప్రాయాలు, స్పందనలు వెలిబుచ్చే అవకాశం, వాతావరణం కలిగించేదిగా ఉంటుంది. కవితలు, గేయాలు, సూక్తులు, వార్తలు, కార్టూన్లు, వ్యాసాలు, జోక్స్‌, బొమ్మలు, తెలిసిన, రాసిన లేదా సేకరించిన సమాచారం మొదలైనవి ప్రదర్శించాలి. ప్రతి వారం గోడపత్రికలోని అంశాలను మార్చుతూ ఉండాలి.

*💧 5. స్కూల్‌ పోస్ట్ బాక్స్:*

👉 పిల్లలు తమ అభిప్రాయాలను, సందేహాలను సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వేదిక పోస్టుబాక్స్ స్కూల్‌ పోస్టు బాక్స్ లోని అంశాలను ఉదయం ప్రార్ధన సమావేశంలో చదివి తోటి విద్యార్ధులకు వినిపించాలి

*💧 6. మేళాల నిర్వహణ:*

👉 తెలుగు, గణిత, విజ్ఞానశాస్త్ర అంశాలకు చెందిన కృత్య సామగ్రిని, ప్రయోగాలను ఒక చోట చేర్చే ప్రదర్శించే వేదిక ఈ కార్యక్రమం ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు సమాజ సభ్యులకు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్గించే కార్యక్రమం.
*🍥 7. ఆవాస ప్రాంత కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేయటం:*
👉 ప్రతి పాఠశాల సిక్స్, కనిష్ట, గరిష్ట ఉష్ణమాపకాన్ని వినియోగించి పాఠశాల ప్రార్థన సమయంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు చదవాలి. ఒక చార్టులో రోజు వారీగా ఉష్ణోగ్రతలు నమోదు చేసి వాటిని తరగతిలో విశ్లేషించాలి
*🅾 8. వర్షపాతం నమోదు చేయటం:*
👉 ప్రతి పాఠశాల వర్షమాపిణి’’ లేదా ప్లాస్టిక్‌ బాటిల్‌లో రూపొందించిన వర్షమాపణి ద్వారా వర్షపడిన సందర్భాలో వర్షపాత వివరాలు చార్టుపై నమోదు చేయాలి. నెల వారీగా వర్షం పడిన రోజులు, ఎన్ని సెం. మీ వర్షం కురిసిందో వాటి వివరాలను విశ్లేషించాలి. ప్రతి నెల ఒక రోజు ఉదయం ప్రార్ధన సమావేశంలో వాటిపై చర్చించాలి
*9. వివిధ కాలాలలో వచ్చే వ్యాధులు, వ్యాధులకు గురయిన వారి సంఖ్య నమోదు చేయటం:*
👉 ఆవాస ప్రాంతంలోని విద్యార్ధులకు వివిధ కాలాలలో వచ్చే వ్యాధులు, వ్యాధికి గురైన విద్యార్ధుల సంఖ్య వివరాలు ప్రతి నెల నమోదు చేయాలి. వాటి వివరాలు స మీ పంలోని ఆరోగ్య కార్యకర్తకు / అందజేసి తిరిగి ఆయా వ్యాధులకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. పిల్లలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలపై అవగాహన కలిగించాలి
*🔵10. కంపోస్టు, ఇంకుడు గుంత నిర్వహణ:*
👉 ప్రతి పాఠశాలలో ఒక మూలలో కంపోస్టు గుంత ఏర్పాటు చేయాలి. రాలిన ఆకులు, మధ్యాహ్న భోజన వ్యర్థ పదార్థాలు వాటిలో వేయాలి. మట్టి, నీరు వినియోగించి కంపోస్టు ఎరువు తయారు చేయాలి.
* 🔵11. ప్లాస్టిక్‌, థర్మకోల్‌ వినియోగించకపోవటం:*
👉 పాఠశాలలో ప్లాస్టిక్‌, ధర్మకోల్‌తో తయారు చేసిన వస్తువులను వాడరాదు. పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్‌ కాగితాలు వాడటం, పారవేయటం చేయరాదు. ప్లాస్టిక్‌ గ్లాసులలో టీ, నీరు తాగటం చేయరాదు. పాఠశాల బయట ప్లాస్టిక్‌ థర్మకోల్‌ రహిత పాఠశాల’’ అనే బోర్డు ప్రదర్శించాలి
*12. నిజాయితీ పెట్టె:*
👉 నిజాయితీ పెట్టె ద్వారా ఇతరుల వస్తువులు పిల్లలు తీసుకోకుండా, సంబంధిత వ్యక్తులకు అందజేసే పని జరుగుతుంది. ఏవైనా వస్తువులు నిజాయితీ పెట్టెలో ఉన్నపుడు ఉదయం పూట ప్రార్థన సమావేశంలో అందరి ముందు సంబంధిత వ్యక్తులకు అందచేయటంతో పాటు అవి నిజాయితీ పెట్టెలో వేసిన విద్యార్ధి వివరాలు తెలిపి అతని / ఆమె చర్యను అభినందించాలి.
*🍀13. పర్యావరణ - మిత్ర:*
👉 పాఠశాల పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉండటానికి పర్యావరణ మిత్ర బాధ్యత వహిస్తుంది. కమిటీకి ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, ఒక ఉపాధ్యాయుడు కన్వీనర్‌గా పనిచేస్తారు. ప్రతి తరగతి నుండి ఒక విద్యార్థిని ఎన్నుకోవాలి. ప్రతి తరగతిలో చెత్తబుట్ట ఏర్పాటు, పాఠశాల ఆవరణ, గదులు శుభ్రంగా ఉండేటట్లు చూడటం, మొక్కల పెంపకం, పక్షులు, జంతువులకు నీరు తాగటానికి తొట్టి, తినడానికి గింజల ఏర్పాటు, నీటిని వృధా చేయకుండా చూడటం వీ రి బాధ్యతలు.
*14. “విందాం-నేర్చుకుందాం’’ రేడియో పాఠాలను విన్పించడం:*
👉 పాఠశాలలో రేడియో ఉందో లేదా చూడాలి. అది పని చేస్తుందో లేదో పరిశీలించాలి.పాఠశాలలో రేడియో పాఠాల షెడ్యూల్‌ అందుబాటులో ఉండాలి.పాఠశాలలో రేడియో పాఠాలు షెడ్యూల్‌ ప్రకారం పిల్లలకు వినిపించాలి.ఏ రోజు ఏ పాఠం వినిపించారో, ఒక నోట్‌ పుస్తకంలో వివరాలు రాయాలి.రేడియో పాఠాలను విన్నారో, లేదో పిల్లలను కూడా ప్రశ్నించి తెల్సుకోవాలి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS